హైదరాబాద్ వచ్చాక అన్నీ మాట్లాడుతా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్వీట్
హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అన్ని అంశాలపై సవివరంగా మాట్లాడుతానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అమెరికా పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకొని హైదరాబాద్‌కు బయల్దేరిన ముఖ్యమంత్రి.. ఆదివారం ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు.
- రాజకీయ కారణాలతో అమెరికా టూర్‌కు అనుమతివ్వలేదని కేంద్రంపై ఆరోపణలు
హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అన్ని అంశాలపై సవివరంగా మాట్లాడుతానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అమెరికా పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకొని హైదరాబాద్‌కు బయల్దేరిన ముఖ్యమంత్రి.. ఆదివారం ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ.. తన అమెరికా పర్యటనకు రాజకీయ కారణాలతోనే అనుమతి నిరాకరించిందని ఆరోపంచారు.
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ.. అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం లండన్ నుంచి బోస్టన్‌కు వెళ్లలేకపోతున్నానని సీఎం ఆ ట్వీట్లో పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రేవంత్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరికొన్ని గంటల్లో తాను హైదరాబాద్‌కు వస్తున్నానని.. అకడికి వచ్చిన తర్వాత మిగిలిన అంశాలపై మాట్లాడుతా అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

