Teacher vacancies | టీచర్ ఖాళీలు 14,171.. మెగా డీఎస్సీ వేస్తామన్న రేవంత్ సర్కార్
సర్కార్ బడుల్లో 14, 171 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. వీటిలో 13,061 టీచర్ పోస్టు లు ఎలిమెంటరీ స్థాయిలోనే ఖాళీగా ఉన్నాయి. మరో 1,110 టీచర్ పోస్టులు సెకండరీ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్నాయి.
- రెండున్నరేండ్లల్లో భర్తీచేసింది 10వేలే
- గంపెడాషాతో బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు
బడి నిర్మాణం తేల్చేదాకా కదలం హైస్కూల్ భవన నిర్మాణం పూర్తిచేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లిలో మంగళవారం ప్రార్థన సమయంలో బైఠాయించిన విద్యార్థులు
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): సర్కార్ బడుల్లో 14, 171 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. వీటిలో 13,061 టీచర్ పోస్టు లు ఎలిమెంటరీ స్థాయిలోనే ఖాళీగా ఉన్నాయి. మరో 1,110 టీచర్ పోస్టులు సెకండరీ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 27వేల స్కూ ళ్లుండగా మొత్తంగా 1,26,820 టీచ ర్ పోస్టులుండగా, ప్రస్తుతం 1,13,057 టీచర్లు పనిచేస్తున్నారు. మరో 14,171 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో టీచర్ల రిటైర్మెంట్లు సైతం పెరుగుతున్నాయి. టీచర్ పోస్టులు ఖాళీ అవుతున్నా ఈ పోస్టులను భర్తీచేయకుండా సర్కార్ చోద్యం చూస్తున్నదని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
కాంట్రాక్ట్ పోస్టుల మీదున్న శ్రద్ధ..
రాష్ట్రంలో రెగ్యులర్ టీచర్ పోస్టులు భారీగా ఖాళీగా ఉండగా, కాంట్రాక్ట్ టీచర్ పోస్టులు ఒక్కటి కూడా ఖాళీగా లేవు. కాంట్రాక్ట్ టీచర్లను టంచన్‌గా భర్తీచేస్తున్న సర్కార్ రెగ్యులర్ పోస్టుల భర్తీలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నది. కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ మీదున్న శ్రద్ధ రెగ్యులర్ పోస్టుల భర్తీలో లేకుండా పోయింది. సమగ్రశిక్షా ప్రాజెక్ట్‌లో ఎలిమెంటరీ విద్యలో 14,277 పోస్టులుంటే మొత్తం భర్తీ అయ్యాయి. సెకండరీలో 4,127 పోస్టులుంటే వీటిలో ఒక్కటి కూడా ఖాళీగా లేవు. ఈ పోస్టుల్లో వందకు వందశాతం పనిచేస్తుండటం గమనార్హం.
టంచన్‌గా టెట్..
టీచర్ పోస్టుల భర్తీ ఊసేలేదు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడంలేదు. కానీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లను మాత్రం ప్రభుత్వం టంచన్‌గా నిర్వహిస్తున్నది. ఏటా రెండు టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నది. రెండేండ్ల నుంచి రాష్ట్రంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాలేదు. 2024 ఫిబ్రవరిలో జారీ అయిన నోటిఫికేషనే ఆఖరు. ఏటా రెండు టెట్ పరీక్షలు ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు నాలుగుకు పైగా టెట్ నోటిఫికేషన్లు జారీచేసింది. కానీ టీచర్ పోస్టులను భర్తీని మాత్రం అటకెక్కించింది. దీంతో డీఎస్సీ ఇంకెప్పుడని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. టీచర్ పోస్టులను భర్తీచేయకుండా, టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఏం లాభమని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. టెట్ పేరుతో వేలకు వేలు ఫీజులు వసూలు చేసుకుని సర్కార్ ఖజానాను నింపుకొంటున్నదని మండిపడుతున్నారు.
25 వేల పోస్టులు హామీ.. ఇచ్చింది 5 వేలే..
జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులను బుట్టలో వేసుకున్న సర్కార్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీచేయకుండా చోద్యం చూస్తున్నది. 25వేల టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక కేవలం ఐదువేల పోస్టుల్లోపే నోటిపై చేసింది. 2023లో బీఆర్ఎస్ సర్కార్ 5,089 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయగా, ఈ నోటిఫికేషన్‌ను రద్దుచేసి, అదనంగా 5,973 పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. వీటిలో 10,006 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మరో 1,056 పోస్టుల భర్తీ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు.
6 వేల పోస్టులంటూ లీకులిచ్చారు. ఇటీవలి కాలంలో టీచర్లు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. ఖాళీ పోస్టుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్రంలో 1.10లక్షల డీఎడ్, 2.40లక్షల మంది బీఎడ్ అభ్యర్థులున్నారు. 3.5 లక్షల అభ్యర్థుల్లో ఇప్పటికే మూడు లక్షల మంది టెట్ పాసయ్యారు. వీరంతా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అవుతుందని ఆశ పెట్టుకున్నారు. అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో శిక్షణ పొందుతున్నారు. కానీ సర్కార్ మాత్రం టెట్ నోటిఫికేషన్‌తోనే సరిపెడుతున్నది. అభ్యర్థులంతా పదే పదే టెట్ రాస్తూ మోసోపోతున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

