Minister KTR Tweet | కేటీఆర్ ట్వీట్‌కు స్పందించి క్రీడాకారుడికి ఆర్థిక సహాయం
Minister KTR Tweet | ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యంగా భావించే మంత్రి కేటీఆర్ తరుచూ బాధితులకు అండగా నిలుస్తున్నారు.
పాలకుర్తి( పెద్దపల్లి ) : ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యంగా భావించే మంత్రి కేటీఆర్ తరుచూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్(Minister KTR) ఇచ్చిన హామీని కొద్దిగంటల్లోనే మంత్రి ఫాలోవర్ ఒకరు తక్షణమే స్పందించి ఆర్థిక సహాయం అందజేయడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం జిల్లాకు చెందిన పారా అథ్లెట్ తాటికొండ నెహ్రూ పుణేలో జరుగనున్న జాతీయపారా అథ్లెటిక్స్‌లో రాష్ట్రం తరుఫున ఆడనున్నారు. తనకు ఆర్థిక సహాయం కావాలని అతడు మంత్రిని ట్విట్టర్(Twitter) ద్వారా అభ్యర్థించారు . తక్షణమే స్పందించిన మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం(Financial Assistance) అందిస్తామని హామీ ఇచ్చారు.
కేటీఆర్ ట్విటర్‌ను చూసే ఫాలోవర్, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి ఎంపీపీ వ్యాళ్ల అనసూర్య రాంరెడ్డి కుమారుడు ఎన్ఆర్ఐ హరీశ్‌రెడ్డి(NRI Harish reddy) స్పందించి, క్రీడాకారుడు నెహ్రూ బ్యాంక్ ఖాతాకు రూ. 60 వేలు పంపించి ఉదారతను చాటుకున్నాడు. హరీశ్‌రెడ్డి గతంలో కూడా కేటీఆర్ ట్వీట్లకు స్పందించి, వైద్య విద్యార్థినికి రూ.2లక్షలు ఆర్థిక సహాయం అందజేసి శభాష్ అనిపించుకున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

