SLBC Tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు
నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో (SLBC Tunnel) సహాయక చర్యలు 36వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. ప్రమాదం జరిగి 36 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఇద్దరు ఇంజనీర్ల మృతదేహాలు మాత్రమే లభించాయి.
నాగర్‌కర్నూల్, మార్చి 29: నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో (SLBC Tunnel) సహాయక చర్యలు 36వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. ప్రమాదం జరిగి 36 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఇద్దరు ఇంజనీర్ల మృతదేహాలు మాత్రమే లభించాయి. మిగిలిన ఆరుగురి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం ఉదయం సైతం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ, కేరళ పోలీస్ క్యాడవార్ డాగ్స్ వంటి రిస్క్యూ టీంలు సహాయ చర్యలు చేపట్టేందుకు సొరంగంలోకి వెళ్లాయి. ఇంత శ్రమిస్తున్న శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదన్న ఆవేదనతో అధికారులు, రెస్క్యూ బృందాలు, కార్మికులు ఉన్నారు. సొరంగంలోకి ఉబికి వస్తున్న నీటి ఊటను నిలువరిస్తే తప్ప సహాయక చర్యలు ముందుకు సాగవనేది రెస్క్యూ బృందాలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రత్యేక అధికారి శివశంకర్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ సలహాలు సూచనలు చేస్తూ అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తేలేకపోతున్నారు. జీఎస్ఐ అధికారుల సూచనలకు అనుగుణంగా ప్రమాద ప్రదేశం నుంచి 30 మీటర్ల వరకు బారికేడింగ్ చేశారు. టెలిటెల్, బాక్స్ క్రీప్ స్ట్రక్చర్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నా మృతదేహాలు బయటకు తీయలేకపోతున్నామనే నిరాశ రెస్క్యూ బృందాలో నెలకొంటుంది.
ప్రమాద ప్రదేశం సమీపంలో మట్టి కింద ఉన్న లోకో ట్రైన్ క్యాబిన్లను తొలగించి లోకో ఇంజిన్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. శనివారం ఆ పనులు పూర్తయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సొరంగంలో చిక్కుకున్న లోకో ట్రైన్ విడిభాగాలను కటింగ్ చేసి బయటకు తరలిస్తున్నారు. పూర్తిస్థాయిలో ట్రైన్ ను మొత్తాన్ని బయటకు తీస్తే రెస్క్యూ బృందాలకు మృతదేహాలను తీసేందుకు మార్గం సులువుగా ఉంటుందని తెలుస్తోంది. ఈరోజు మొత్తం పూర్తిస్థాయిలో అవే పనులు జరుగుతున్నట్లు సమాచారం. కాగా, పలానా చోట డెడ్ బాడీ ఉంది అని తెలిసినా బయటకు తీయలేకపోతున్నామనే నిరాశతో రెస్క్యూ బృందాలు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- GSI
- NDRF
- rescue operation
- SDRF
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

