కామారెడ్డి | గుహలోనే వేటగాడు రాజు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Kamareddy | వేటకు వెళ్లి గుహలో ఇరుక్కుపోయిన వేటగాడు రాజును బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం కన్నపురం శివారు అటవీ ప్రాంతంలో
కామారెడ్డి: వేటకు వెళ్లి గుహలో ఇరుక్కుపోయిన వేటగాడు రాజును బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం కన్నపురం శివారు అటవీ ప్రాంతంలో రాజు అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం వేటకు వెళ్లాడు. అక్కడున్న ఓ గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని ఫోను కింద పడిపోయింది. దానిని తీసేందుకు ప్రయత్నించడంతో గుహలో మరింత లోతుకు వెళ్లి ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. అతడిని బయటకు తీసేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో అగ్నిమాపక, రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం మధ్యహ్నం 3 గంటలకు ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది. రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోవడంతో అతడు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నాడని అధికారులు తెలిపారు. భారీ క్రేన్ సహాయంతో చుట్టుపక్కల సమాంతరంగా తవ్వకాలు చేపట్టామన్నారు. కామారెడ్డి ఏఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథ్.. సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- cave
- Kamareddy
- raju
- Rama Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

