Shiva Balakrishna | రెరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణకు బెయిల్
Shiva Balakrishna | రెరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జనవరి 25న శివ బాలకృష్ణ అరెస్టయిన విషయం తెలిసిందే. నిర్ణీత 60 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోవడంతో శివబాలకృష్ణకు కోర్టు బెయిల్ ఇచ్చింది.
Shiva Balakrishna | రెరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జనవరి 25న శివ బాలకృష్ణ అరెస్టయిన విషయం తెలిసిందే. నిర్ణీత 60 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోవడంతో శివబాలకృష్ణకు కోర్టు బెయిల్ ఇచ్చింది. రూ.లక్ష, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అయితే, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శివబాలకృష్ణకు ఆదేశించింది. ఆయన సోదరుడు శివ నవీన్‌కు సైతం బెయిల్‌ను ఇచ్చింది.
ఇంతకు ముందు శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు కొట్టివేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన వద్ద రూ.250 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. శివ బాలకృష్ణ పేరిట బినామీల పేరుతో 214 ఎకరాల భూమి, ఏడు ఇండ్లు, ఒక విల్లా ఉన్నట్టు ఏసీబీ అధికారులు విచారణలో గుర్తించారు. వీటితో పాటు కుటుంబసభ్యుల పేరుతో 29 ప్లాట్లు ఉన్నట్లు తేల్చారు. 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు బంధువుల పేరుతో ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడింది. ఇప్పటివరకు బయటపడిన ఆస్తులు రూ.250 కోట్ల విలువ చేస్తాయని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

