నాడు సంరక్షణ.. నేడు నరికివేత
బీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలని హరితహారం కింద మొక్కలు పెంచి సంరక్షిస్తే.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నది. సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారి వెంట వేలాది మొక్కలను నాటగా వృక్షాలుగా ఎదుగుతున్నాయి.
- సిద్దిపేట జిల్లా ములుగు, వంటిమామిడిలో చెట్ల తొలగింపు
ములుగు, జూన్ 12: బీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలని హరితహారం కింద మొక్కలు పెంచి సంరక్షిస్తే.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నది. సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారి వెంట వేలాది మొక్కలను నాటగా వృక్షాలుగా ఎదుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా ములుగు, వంటిమామిడి మధ్యలో రాజీవ్ రహదారికి ఇరువైపులా పెరిగిన 20 చెట్లను అధికారులు నరికేశారు. ్ల విద్యుత్తు తీగలకు అడ్డుగా ఉన్న కొమ్మలను తొలిగిస్తే పోయేదానికి పూర్తిగా చెట్టునే నరికి పర్యావరణానికి విఘాతం కలిగించారు. మొక్కలు నాటాలని చెప్పాల్సిన ప్రభుత్వం, అధికారులు అడ్డగోలుగా చెట్లను నరికివేయించడంతో ప్రయాణికులు ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

