UGC | చదువులు ఇక లెవల్స్.. జాతీయ స్థాయిలో ఒకే తరహా క్రెడిట్స్ విధానం: యూజీసీ చైర్మన్ జగదీశ్‌కుమార్
జాతీయస్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్ రూపొందించామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ స్పష్టంచేశారు.
- నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్క్ విడుదల
UGC | హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : జాతీయస్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్ రూపొందించామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ స్పష్టంచేశారు. జాతీయ విద్యావిధానం-2020కి అనుగుణంగా పాఠశాల విద్య నుంచే క్రెడిట్స్ ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఏకీకృత విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇదే కోవలో తాము నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్క్‌ను విడుదల చేశామని తెలిపారు. నేషనల్ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేంవర్క్, నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేంవర్క్, నేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రేంవర్క్‌లను ఏకీకృతం చేశామని వివరించారు.
ముఖ్యాంశాలిలా
- వివిధ స్థాయిల్లో మారుల స్థానంలో క్రెడిట్స్ ఇస్తారు. ఒక విద్యార్థి సంవత్సరంలో రెండు సెమిస్టర్లలో 30 గంటల బోధన (ఏదైనా సబ్జెక్టులో) తరగతులకు హాజరవ్వాలి. ప్రతీ సెమిస్టర్‌కి 20 క్రెడిట్స్ ఉంటాయి. ఏడాదికి అన్ని సబ్జెక్టులు కలిపి 1,200 గంటల బోధన సమయంలో విద్యార్థి 40 క్రెడిట్స్ పొందుతాడు.
- వృత్తి, నైపుణ్య విద్య లెవల్ 4.5 నుంచి లెవల్ 8 వరకు ఉన్నది.
- పీహెచ్డీ పూర్తిచేసిన వారికి 320 క్రెడిట్స్ రావాలి. బ్యాచిలర్ డిగ్రీ ముగిసేనాటికి 120 క్రెడిట్స్ పొందాలి.
- క్రెడిట్స్ మార్పిడి ఐటీఐ (రెండేండ్ల) కోర్సు పూర్తి చేసిన విద్యార్థి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ నుంచి అదనపు భాషా కోర్సులను చదివితే ఇంటర్‌తో సమానంగా పరిగణిస్తారు.
- అకాడమికేతర అంశాలైన క్రీడలు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ , మ్యూజిక్ , హెరిటేజ్ , ట్రెడిషనల్ సిల్స్ , ఫైన్ ఆర్ట్స్ వంటి ప్రత్యేక కళలకూ క్రెడిట్స్ ఇస్తారు.

17
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

