వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.1,100కోట్లు.. మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
Warangal Super Specialty Hospital | రంగల్లో నిర్మించనున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2వేల పడకలతో నిర్మించనున్న

హైదరాబాద్ : వరంగల్‌లో నిర్మించనున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2వేల పడకలతో నిర్మించనున్న దవాఖానకు రూ.1,100 కోట్లు మంజూరు చేస్తూ వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో సివిల్ వర్క్స్‌కు రూ.509 కోట్లు, మంచినీరు, పారిశుధ్యం కోసం రూ.20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం రూ.182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.105 కోట్లు, అనుబంధ పనుల కోసం రూ.54.28 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం రూ.229.18 కోట్ల నిధుల కోసం అనుమతులు ఇచ్చారు. టీఎస్ఎంఐడీసీ, డీఎంఈ ఆధ్వర్యంలో వెంటనే పనులు చేపట్టాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశించారు.

వరంగల్‌ను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సీఎం భారీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆసుపత్రి నిర్మాణానికి వరంగల్ సెంట్రల్ జైలు ఆవరణలో జూన్ 21న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. 15 ఎకరాల్లో 24 అంతస్థుల్లో భారీ ఆసుప్రతి నిర్మాణం జరుగనున్నది. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు.
2వేల పడకల సామర్థ్యంతో నిర్మించనున్న దవాఖానలో 36 విభాగాలు పని చేస్తాయని ఇంతకు ముందే వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. సుమారు 500 మంది వైద్యులు, వెయ్యి మందికిపైగా నర్సులు, పారామెడికల్ సిబ్బందితోపాటు ఇతర సిబ్బంది పని చేయనున్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయై అందుబాటులోకి వస్తే.. నిరుపేదలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హైదరాబాద్ బాట పట్టే కష్టాలకు తెరపడనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

