Rekha Boyalapally | ‘మనుస్మృతి’ పేరుతో మహిళల హక్కులను హరించే కుట్ర.. మండిపడిన మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు
Rekha Boyalapally : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అవమాన పరుస్తోందని, మహిళా హక్కులను హరించేందుకు కుట్ర పన్నుతోందని తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి (Rekha Boyapally) విమర్శించారు.
Rekha Boyalapally : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అవమాన పరుస్తోందని, మహిళా హక్కులను హరించేందుకు కుట్ర పన్నుతోందని తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి (Rekha Boyalapally) విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar) రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ఘోర ప్రయత్నం జరుగుతోందని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్టుగా బీజేపీ వాళ్ళకి రాజ్యాంగం కాదు, మనుస్మృతి కావాలి. మహిళల హక్కులను తొలగించే ప్రయత్నమే ఇది.
ఈ మధ్య ఆరెస్సెస్ నేత దత్తాత్రేయ హోసబాలే ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ అనే పదాలను రాజ్యాంగ ప్రవేశిక (Preamble) నుంచి తొలగించాలంటూ చేసిన వ్యాఖ్యలను తేలికగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే.. బీజేపీది భయంకరమైన భావజాలం అని రేఖ పేర్కొన్నారు. అంతేకాదు మనుస్మృతిలో మహిళల పరిస్థితి ఎలా ఉండేదో వివరించారు రేఖ. అమ్మాయిలను చదువుకోవడానికి అనుమతించేవారు కాదని, ఆస్తి మీద హక్కు లేదని,. వింతతువులకు పెళ్లి చేయడంపై నిషేధం ఉండేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమ్మాయిలు ప్రేమ వివాహం చేసుకోవడం.. ఉద్యోగం చేయడం, స్వేచ్ఛగా జీవించడం వంటి వాటిని మనువాదులు నేరంగా పరిగణించేవాళ్లని రేఖ తెలిపారు.
డిమాండ్లు ఇవే
రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛను కల్పించిందని రేఖ అన్నారు. ఆర్టికల్ 14: సమానత్వం, ఆర్టికల్ 15: లింగ వివక్షను నిషేధించడం, ఆర్టికల్ 16 : సమాన ఉద్యోగ అవకాశాలు, ఆర్టికల్ 21: వ్యక్తిగత గౌరవం, స్వేచ్ఛతో జీవించే హక్కును రాజ్యాంగం మనకు ప్రసాదించిందని ఆమె వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు బీజేపీ ముందుంచారు. అవేంటంటే.. మహిళలకు రాజ్యాంగ హక్కులకు పూర్తి రక్షణ ఇవ్వాలి.
రాజ్యంగా ప్రవేశికలోని “సోషలిస్టు”, “సెక్యులర్” పదాలను తొలగించకూడదని ఆమె బీజేపీని డిమాండ్ చేశారు. అంతేకాదు ప్రతి మహిళా తన హక్కుల కోసం మాట్లాడాలి. యువత రాజ్యాంగం మీద అవగాహన పెంచుకోవాలి. బీజేపీ ప్రోత్సహిస్తున్న మతపరమైన భావజాలాన్ని అడ్డుకోవాలి అంటే రేఖ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
- Daren Sammy | ఐసీసీ కోడ్ ఉల్లంఘన.. వెస్టిండీస్ హెడ్కోచ్ మ్యాచ్ ఫీజులో కోత.
- Air India Flight | క్యాబిన్లో కాలిన వాసన.. వెనుదిరిగిన ఎయిరిండియా విమానం..!
- Newly-Wed Wife Murdered Man | పెళ్లి కోసం ఆరాటపడిన వ్యక్తి.. పెళ్లైన కొన్ని రోజులకే హత్య చేసిన నవ వధువు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

