Warangal NIT | వరంగల్ నిట్‌లో రికార్డు ప్లేస్‌మెంట్స్.. 270కిపైగా కంపెనీల్లో 1400 మందికి..!
Warangal NIT | ఈ ఏడాది వరంగల్ నిట్‌లో రికార్డు స్థాయిలో ప్లేస్మెంట్స్ను సాధించామని, గతేడాదితో పోల్చితే అత్యధిక ప్యాకేజీతో పాటు ఉద్యోగాల సంఖ్య సైతం పెరిగిందని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు ప్రకటించారు.
Warangal NIT | ఈ ఏడాది వరంగల్ నిట్‌లో రికార్డు స్థాయిలో ప్లేస్మెంట్స్ను సాధించామని, గతేడాదితో పోల్చితే అత్యధిక ప్యాకేజీతో పాటు ఉద్యోగాల సంఖ్య సైతం పెరిగిందని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు ప్రకటించారు. నిట్‌లోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్లో అక్షయ పేరిట సక్సెస్ మీట్ నిర్వహించారు. కార్యక్రమానికి టెక్ మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) దుర్గాప్రసాద్ అల్లాడ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిట్‌లోని సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ (సీసీపీడీ) ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన ప్లేస్మెంట్ సంవత్సరాన్ని ప్రకటించినందుకు గర్వంగా ఉందన్నారు.
2022-23 విద్యాసంవత్సరంలో 1400 మందికి ఆఫర్లు అందుకున్నారన్నారు. అదనంగా 450 మంది ఎక్కువ ఇంటర్న్‌షిప్ ఆఫర్లు సైతం విద్యార్థులులు అందుకున్నారన్నారు. సీసీపీడీ బీటెక్ 82శాతం ప్లేస్మెంట్ రేట్‌ను సాధించారని, ఏడాదికో విద్యార్థికి అత్యధికంగా రూ.88 లక్షల సీటీసీ (కాస్ట్ టు కంపెనీ) అందించారన్నారు. సగటు మధ్యస్థ సీటీసీ కూడా గతేడాది కంటే భారీ పెరుగుదల నమోదైందన్నారు. సగటు సీటీసీ రూ.17.29 లక్షలు, మధ్యస్థ సీటీసీ రూ.12.6 లక్షలతో ప్లేస్‌మెంట్స్ వచ్చాయన్నారు.
క్యాంపస్‌ను సందర్శించిన 270కిపైగా కంపెనీలు..
2022-23 విద్యా సంవత్సరంలో 270 కంటే ఎకువ కంపెనీలు క్యాంపస్‌ను సందర్శించారని, వారిలో 40 శాతం మంది క్యాంపస్‌ను మొదటిసారి సందర్శించినట్లు రమణారావు తెలిపారు. 2021లో-186 కంపెనీలు, 2022లో-221, 2023లో 268 కంపెనీలు వచ్చాయని వివరించారు. ప్రఖ్యాత కంపెనీలు లాభదాయకమైన ప్యాకేజీలతో ఒకే ప్లేస్మెంట్ డ్రైవ్‌లో 35మంది విద్యార్థులను నియమించుకున్నట్లు చెప్పారు. దాదాపు అన్ని రంగాలలో నియామకాల పెరుగుదల కనిపించిందన్నారు. ఐటీ అన్ని విభాగాల నుంచి వచ్చిన మొత్తం ఎఫ్‌టీఈ ఆఫర్లలో 54శాతం కలిగి ఉందన్నారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ వంటి ఐటీ రంగాల్లో చాలా డిమాండ్ ఉన్నాయన్నారు. శిక్షణా కోర్సులు, సహకార కార్యక్రమాల ద్వారా సీసీపీడీ చొరవ అన్ని కార్యక్రమాల నుండి విద్యార్థులకు ఫలవంతమైందన్నారు. విద్యార్థుల ప్రాక్టికల్ డొమైన్ పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి, ప్రస్తుత రిక్రూట్మెంట్ దృష్టాంతం ఆధారంగా ఇంటర్వ్యూలకు వారిని సిద్ధం చేయడానికి కోర్సులు అందిస్తున్నట్లు చెప్పారు. అదనంగా, విభాగాలు, వెలుపలి సంస్థల సహకారంతో సీసీపీడీ కమ్యూనికేషన్ సిల్-బిల్డింగ్ వర్షాప్లు, పారిశ్రామిక సందర్శనలు, ఇంటర్న్‌షిప్‌ల వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. వరంగల్ నిట్‌కి ఒక చారిత్రక ఘనత అని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

