HMDA | కోకాపేటలో ఎకరానికి రూ. 100.75 కోట్లు.. ప్రభుత్వానికి రూ. 3,319.60 కోట్ల ఆదాయం
HMDA | కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధర పలికాయి. హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికంగా ఎకరం ధర రూ. 100 కోట్లు పలికింది. రికార్డు స్థాయిలో భూముల ధరలు పలకడం మార్కెట్ వర్గాల్లో సంచలనంగా మారింది.
HMDA | హైదరాబాద్ : కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధర పలికాయి. హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికంగా ఎకరం ధర రూ. 100 కోట్లు పలికింది. రికార్డు స్థాయిలో భూముల ధరలు పలకడం మార్కెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. కోకాపేట నియో పోలిస్ భూములకు గురువారం ఉదయం వేలం ప్రారంభం కాగా, రాత్రి 8 గంటల వరకు వేలం కొనసాగింది. కోకాపేట భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ. 3,319.60 కోట్ల ఆదాయం సమకూరింది. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి రూ. 100.75 కోట్లు పలకగా, అత్యల్పంగా రూ. 67.25 కోట్లు పలికింది. ఎకరం భూమి సగటున రూ. 73.23 కోట్లు పలికింది.
కోకాపేట నియో పోలిస్ ఫేజ్-2లో 45.33 ఎకరాలకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించింది. తొలి సెషన్లో ఫేజ్-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం నిర్వహించగా, రెండో సెషన్లో 10, 11, 14 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో షాపూర్ జీ పల్లోంజి, ఎన్సీసీ, మైహోం, రాజ్‌పుష్ఫ తదితర ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు పాల్గొన్నట్లు సమాచారం.
నియో పోలిస్ ఫేజ్-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. 10వ నెంబర్ ప్లాట్లోని ఎకరం భూమి ధర అత్యధికంగా రూ. 100.75 కోట్ల ధర పలికింది. 3.6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 10వ నెంబర్ ప్లాట్‌ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రాజపుష్ప, , హ్యాపీ హైట్స్ కలిసి రూ. 362.70 కోట్లకు దక్కించుకున్నాయి. 7.53 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 11వ ప్లాట్‌లో ఎకరం ధర అత్యల్పంగా రూ. 67.25 కోట్లు ధర పలికింది.
ప్లాట్ నంబర్ 6
విస్తీర్ణం – 7 ఎకరాలు
ఎకరా – రూ. 73 కోట్లు
ఆదాయం – రూ. 511 కోట్లు
ప్లాట్ నంబర్ 7
విస్తీర్ణం – 6.55 ఎకరాలు
ఎకరా – రూ. 75.50 కోట్లు
ఆదాయం – రూ. 494.53 కోట్లు
ప్లాట్ నంబర్ 8
విస్తీర్ణం – 9.71 ఎకరాలు
ఎకరా – రూ. 68 కోట్లు
ఆదాయం – రూ. 660.28 కోట్లు
ప్లాట్ నంబర్ 9
విస్తీర్ణం – 3.60 ఎకరాలు
ఎకరా – రూ. 75.25 కోట్లు
ఆదాయం – రూ. 270.90 కోట్లు
ప్లాట్ నంబర్ 10
విస్తీర్ణం – 3.60 ఎకరాలు
ఎకరా – రూ. 100.75 కోట్లు
ఆదాయం – రూ. 362.70 కోట్లు
ప్లాట్ నంబర్ 11
విస్తీర్ణం – 7.53 ఎకరాలు
ఎకరా – రూ. 67.25 కోట్లు
ఆదాయం – రూ. 506.39 కోట్లు
ప్లాట్ నంబర్ 14
విస్తీర్ణం – 7.34 ఎకరాలు
ఎకరా – రూ. 70 కోట్లు
ఆదాయం – రూ. 513.80 కోట్లు

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air Purifiers | ఎయిర్ ప్యూరిఫైర్లను ఉపయోగిస్తే షుగర్ లెవల్స్‌ను తగ్గించవచ్చు.. తేల్చి చెబుతున్న వైద్య నిపుణులు..
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
Jayannth & The Jingo Pen | దిల్ రాజు చేతుల మీదుగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నుంచి ‘నా కనుపాపే’ సాంగ్ విడుదల
Vaccine | చిన్నతనంలో కొన్ని టీకాలు వేయించుకోని వారు పెద్దయ్యాక తీసుకోవచ్చా.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..?
పేదలకు పెన్షన్లే ఆర్థిక భరోసా : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

