ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 2 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్ష ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో జూనియర్, సీనియర్, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సుల రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈ నెల 14వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని చెప్పారు.
రూ.300 అపరాధ రుసుముతో ఈ నెల 16వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు ఆయన వివరాలను వెల్లడించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూడొచ్చన్నారు.