హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 20 మంది ఎస్పీ (నాన్ క్యాడర్) వెయిటింగ్లకు పోస్టింగ్లు ఇస్తూ, మరికొందరు ఆన్ డ్యూటీ ఆఫీసర్లను బదిలీ చేస్తూ హోంశాఖ ఇన్చార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా సోమవారం ఉత్తర్వులిచ్చారు.
ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని వెల్లడించారు. 26 మంది అదనపు ఎస్పీ (నాన్ క్యాడర్)లకు బదిలీలు, పోస్టింగులు ఇచ్చారు.