Rangareddy : కుండపోత వాన.. పోటెత్తిన వరద
- ఆపిల్ ఎవెన్యూ కాలనీని ముంచెత్తిన వరద నీరు
- పలు గ్రామాలకు స్థంభించిన రాకపోకలు
- సహాయక చర్యల్లో అధికారులు

తుర్కయాంజల్ : శుక్రవారం రాత్రి 7గంటల నుంచి 10గంటల వరకు కురిసిన భారీ వర్షానికి తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తుర్కయాంజల్ పరిసర గ్రామాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో వాన దంచికొట్టడంతో మాసాబ్ చెరువుకు వరద ఉధృతి పోటెత్తింది. చెరువు అలుగు పెద్ద ఎత్తున్న ప్రవహిస్తుండటంతో దిగువ ఉన్న ఇంజాపూర్ ఆపిల్ ఎవెన్యూ కాలనీని వరద నీరు ముంచెత్తింది. దీంతో కాలనీపూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఏకంగా 9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఒకే సంవత్సరంలో మాసాబ్ చెరువుకు మూడుసార్లు పెద్ద ఎత్తున వరదలు రావటం ఇదే తొలిసారి కావటంతో పరిసర కాలనీలు ముంపునకు గురి అయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు మాసాబ్ చెరువుకు ఎగువన ఉన్న ఆదిత్యనగర్ కాలనీని చెరువు నీరు చుట్టుముట్టింది. దీంతో కాలనీవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మాసాబ్ చెరువుకు పోటెత్తిన వరద
తుర్కయాంజల్ మాసాబ్ చెరువుకు వదర నీరు పోటెత్తింది. ఎగువన ఉన్న నాదర్గుల్, మీర్‌పేట, కుర్మగూడ తదితర ప్రాంతాల్లో చెరువులు ఒకేసారి అలుగు పారుతుండటంతో ఈ నీరంత తుర్కయాంజల్ మాసాబ్ చెరువుకు పెద్ద ఎత్తున్న చేరుతుంది. ఇంజాపూర్-తొరూర్ గ్రామాల రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ఇరు గ్రామాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. అలాగే దీనికి దిగువన ఉన్న మునగనూర్-హయత్ నగర్ రోడ్డు మార్గంపై కూడా వరద ఉధృతంగా ప్రవహిస్తున్నందున వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ద్విచక్ర వాహనదారుడు ఈ మార్గంలో రోడ్డు దాటుతుండగా హోండ యాక్టివ వరద తాకిడికి కొట్టుకుపోగా స్థానికులు కాపాడారు.

అలాగే మునగనూర్-పెద్దఅంబర్‌పేట రోడ్డు మార్గంలో మల్లికార్జున స్వామి దేవాలయం సమీపంలోని కల్వర్టు పై నుంచి వరద నీరు ప్రవహించటంతో ఇరు గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. మరో పక్క కొహెడ వెంకట్‌రెడ్డి, వాగుకు మరోసారి వరద నీరు పోటెత్తి కొహెడ-తొరూర్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధగా పెద్దఅంబర్‌పేట ఈదల చెరువు అలుగు భారీ ఎత్తున పారుతుండంటంతో పెద్దఅంబర్‌పేట-కొహెడ రోడ్డు మార్గంలో వరద ప్రవహిస్తుంది. దీంతో ఈ మార్గంలో కూడా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా అధికారులు ఆయా రోడ్డు మార్గాల్లో భారీకేడ్లను ఏర్పాటు చేసి వాహనదారులు రాకపోకలు సాగించకుండా చర్యలు చేపట్టారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

