ఎలాంటి ఆపద లేకుండా బాగా చూసుకుంటా.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
Rangam | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతున్నది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా ఆలయంలో రంగం (Rangam) కార్యక్రమం జరిగింది
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతున్నది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా ఆలయంలో రంగం (Rangam) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తన భక్తులను ఎలాంటి ఆపద లేకుండా చూసుకుంటానని, కంటతడి పెట్టకుండా పూజలు చేయాలని, కోరుకున్నది తప్పక నెరవేరుతుందని భవిష్యవాణి చెప్పారు. గర్భిణులకు, బాలింతలకు ఎటువంటి బాధలు రానివ్వనని అమ్మవారి వాక్కుగా చెప్పారు.

‘ప్రజలు పూజలు మొక్కుబడిగా చేసున్నారు. పూజలు మీ సంతోషానికే చేస్తున్నారు తప్ప.. నా కోసం కాదు. నాకు పూజలు చేస్తున్నారా.. వాస్తవం చెప్పండి. పూజలు ఎలా చేయాలో ఏటా నన్నే అడుగుతున్నారు. మొక్కుబడిగా పూజలు చేస్తున్నా.. నా బిడ్డలే కదా అని భరిస్తున్నా. మీరు నా గుడిలో పూజలు సరిగా సరిపించడం లేదు. గర్భాలయంలో శాస్త్రబద్ధంగా పూజలు చేయండి. పూజలు సక్రమంగా, భక్తిశ్రద్ధలతో జరిపించండి. నేను సంతోషంగా పూజలు అందుకోవాలని అనుకుంటున్నా.
ఎన్ని రూపాల్లో నన్ను మారుస్తారు.. మీకు నచ్చినట్లు మారుస్తారా?. స్థిరమైన రూపంలో నేను కొలువుదీరాలని అనుకుంటున్నా. నా రూపాన్ని స్థిరంగా నిలపండి. మీరేంటి నాకు చేసేది.. నేను తెచ్చుకున్నదే కదా. దొంగలు దోచినట్లుగా నా నుంచే మీరు కాజేస్తున్నారు. మీ కళ్లు తెరిపించేందుకే ఆగ్రహంతో వర్షాలు కురిపిస్తున్నా. ఆగ్రహం తట్టుకోలేరనే కోపాన్ని గోరంతే చూపుతున్నా. మీరు కొండంత తెచ్చుకుంటున్నా నాకు గోరంతే పెడుతున్నారు. నా విగ్రహ ప్రతిష్ఠను ఏడాదిలోపు నాకు స్థిరంగా చేయండి.

ఎటువంటి ఆపద లేకుండా మిమ్మల్ని బాగా చూసుకుంటా. మీరు కోరుకున్నది తప్పక నెరవేరుతుంది. కంటతడి పెట్టకుండా నాకు పూజలు చేయండి. మీరు ఎన్ని తప్పులు చేసినా నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నా. గర్భిణులు, బాలింతలకు ఎటువంటి రానివ్వను’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కాగా, రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

