హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ (Mahamood Ali) నివాసంలో రంజాన్ వేడుకలు (Ramadan Celebrations) జరిగాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR) హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీకి కేటీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలావుంటే రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నూతన వస్త్రాలు ధరించి మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు.