పాఠశాల విద్యలో గ్రేడ్-2 ర్యాంక్

- 2019-20లో రాష్ర్టానికి 772 పాయింట్లు
- పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ప్రకటించిన కేంద్రం
- గతంలోనూ గ్రేడ్- 2 ర్యాంక్‌లోనే తెలంగాణ
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యలో తెలంగాణ రాష్ట్రం గ్రేడ్-2 ర్యాంకును సొంతం చేసుకున్నది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, పాఠశాలల నిర్వహణలో ఉత్తమ ప్రదర్శనను కనబరిచింది. ఈ విషయాన్ని పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) ద్వారా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2019- 20 సంవత్సరానికి పీజీఐ గ్రేడ్లను కేంద్రం విడుదలచేయగా, తెలంగాణ 2018-19 కంటే స్కోర్‌ను మెరుగుపరుచుకోవడం విశేషం. 2018-19లో 757 పాయింట్లు పొందగా, 2019- 20లో 772 పాయింట్లు పొందడం గమనార్హం. తెలంగాణ గతంలోనే గ్రేడ్-2 ర్యాంకును సొంతంచేసుకోగా, తాజా పీజీఐ ఇండెక్స్‌లోనూ అదే ర్యాంకు పొందింది. మూడు క్యాటగిరీల్లో 70 అంశాల ఆధారంగా కేంద్ర విద్యాశాఖ మూడేండ్లుగా రాష్ర్టాలకు ఈ ర్యాంకులను కేటాయిస్తున్నది.
రాష్ట్రం పొందిన పాయింట్లు ఇలా..
- పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, వసతుల కల్పన విభాగంలో 150 పాయింట్లకు 113 సాధించింది.
- 2018- 19లో ఈ క్యాటగిరీలో 92 పాయింట్లను 113కు పెంచుకోవడం గమనార్హం.
- ఈక్విటీ క్యాటగిరీలో 230 పాయింట్లకు 210 పాయింట్లు సాధించింది.
- గవర్నెన్స్ ప్రాసెస్ విభాగంలో 360 పాయింట్లకు 238 పాయింట్లు పొందింది.
- నాణ్యతాప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన ఫలితాల్లో 180 పాయింట్లకు 142 పాయింట్లు సొంతం చేసుకున్నది.
- యాక్సెస్ విభాగంలో 80 పాయింట్లకు 69 పాయింట్లు పొందింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

