జర్మనీ పౌరసత్వాన్ని వదులుకొన్నా

హైకోర్టులో చెన్నమనేని రమేశ్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు
హైదరాబాద్, జూన్ 22, (నమస్తే తెలంగాణ): జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నానని, ప్రస్తుతం తనకు భారతదేశ పౌరసత్వం మాత్రమే ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. గతంలో జారీ అయిన జర్మన్ పాస్‌పోర్టుపై ప్రయాణించినంత మాత్రాన తనకు జర్మనీ పౌరసత్వం ఉన్నట్టు కాదన్నారు. ఆయన పౌరసత్వ వివాదంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని వివరణపై కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రం గడువు కోరడంతో విచారణ రెండు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ఉత్తర్వులు జారీ చేశారు. భారత పౌరసత్వ చట్టంలోని 5.1ఎఫ్ నిబంధనకు లోబడి, తాను జర్మనీ పౌరసత్వ చట్టం ఆర్టికల్ 17కు అనుగుణంగా ఆ దేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు చెన్నమనేని రమేశ్ అఫిడవిట్లో పేర్కొన్నారు. భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 9.2లోని షెడ్యూల్ 3 చెల్లదని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. జర్మనీ పౌరసత్వం వదులుకొన్నట్టుగా అధికారిక ధృవీకరణ పత్రాన్ని ఇదివరకే హైకోర్టుకు నివేదించినట్టు తెలిపారు. దీనిపై కౌంటర్ దాఖలుకు కేంద్రం రెండు వారాల సమయాన్ని కోరటంతో విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
Smart Phone Tips | మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ సెట్టింగ్స్ మార్చి చూడండి
సింపుల్ లుక్‌తోనే మాయ చేస్తోన్న వైష్ణవి చైతన్య.. ఫొటోలు చూశారా?
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

