ఉద్యమకారులను బలి తీసుకున్నదే కాంగ్రెస్
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో 1200 మందికి పైగా విద్యార్థులు, ఉద్యమకారులను బలి తీసుకున్నదే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు డీ రాజారాంయాదవ్ ఆరోపించారు.
- అమరవీరుల కాలనీ కట్టే హకు ఆ పార్టీకి లేదు
- కాలనీ కోసం వందెకరాల భూమి కేటాయించాలి
- గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఉన్నదంతా పట్టా భూమినే
- బీఆర్ఎస్ సీనియర్ నేత డీ రాజారాంయాదవ్
అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో 1200 మందికి పైగా విద్యార్థులు, ఉద్యమకారులను బలి తీసుకున్నదే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు డీ రాజారాంయాదవ్ ఆరోపించారు. తెలంగాణ బిడ్డల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కాంగ్రెస్‌కు.. అమరవీరులకాలనీ కట్టే నైతికహక్కు ఏ మాత్రం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అమరవీరులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు ‘హంతకుడే సంతాపం తెలిపిన చందంగా ఉన్నది’ అని మండిపడ్డారు.
కాలనీకి వందెకరాలు కేటాయించాలి
అమరవీరుల కుటుంబాల కాలనీ నిర్మాణానికి హైదరాబాద్ నగరంలో స్థలం లేదా? అని రాజారాంయాదవ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి అమరవీరులపై చిత్తశుద్ధి ఉంటే.. నగర నడిబొడ్డున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేదా హైటెక్‌సిటీ పరిసరాల్లో 100 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ మంత్రులు, నాయకులు నగరంలో ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను గుర్తించి ఉద్యమకారులతో కలిసి జెండాలు పాతేస్తామని హెచ్చరించారు. ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ఇంటి పరిసర భూములపై రేవంత్ సరార్ అసత్య ప్రచారాలు చేస్తున్నదని మండిపడ్డారు. అధికారులు స్వయంగా చేపట్టిన సర్వేలోనే కేసీఆర్ వద్ద ఉన్నదంతా చట్టబద్ధమైన పట్టా భూమేనని స్పష్టమైందని గుర్తుచేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

