Indiramma Illu | నా కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా.. కామారెడ్డి జిల్లాలో మహిళకు కాంగ్రెస్ నాయకుడి వేధింపులు
Indiramma Illu | నా కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళపై కాంగ్రెస్ నాయకుడు వేధింపులకు పాల్పడ్డాడు. అతని వేధింపులతో విసిగిపోయిన మహిళ ఇటీవల పోలీసులను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Indiramma Illu | నా కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళపై కాంగ్రెస్ నాయకుడు వేధింపులకు పాల్పడ్డాడు. తన మాట వినడం లేదని డబుల్ బెడ్రూం ఇండ్ల జాబితాలో పేరు వచ్చినా దాన్ని తొలగించాడు. అతని వేధింపులతో విసిగిపోయిన మహిళ ఇటీవల పోలీసులను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన మహిళ ఇల్లు కూలిపోవడంతో రెండేళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటుంది. దీంతో ఇందిరమ్మ ఇల్లు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే ఓ కాంగ్రెస్ నాయకుడిని ఆశ్రయించగా.. తన కోరిక తీర్చాలని.. అప్పుడే ఇల్లు మంజూరు చేయిస్తానని చెప్పాడు. అందుకు సదరు మహిళ నిరాకరించింది. దీంతో కక్ష గట్టిన కాంగ్రెస్ నాయకుడు.. డబుల్ బెడ్రూం ఇళ్ల జాబితాలో తన పేరు వచ్చినా తొలగించాడని బాధిత మహిళ సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణమని పేర్కొంది.
కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించడంతో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. మహిళను వేధించిన రాజంపేట కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడిని సస్పెండ్ చేసిందని సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

