హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 30జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా నాగర్కర్నూల్, పెద్దపల్లి, నిర్మల్, నల్లగొండ, మంచిర్యాల, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అలాగే ఈనెల10వ తేదీ వరకు పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా గురువారం నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. రాష్ట్రంపై నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.