Rains | తెలంగాణలో కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి.. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Rains | తెలంగాణ నుంచి మధ్య బంగాళాఖాతంలోని పాంతాల వరకు కొనసాగిన ద్రోణి శుక్రవారం రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ మధ్యలో కొనసాగుతుంది.
Rains | హైదరాబాద్ : తెలంగాణ నుంచి మధ్య బంగాళాఖాతంలోని పాంతాల వరకు కొనసాగిన ద్రోణి శుక్రవారం రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ మధ్యలో కొనసాగుతుంది. గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
శుక్రవారం మెదక్ జిల్లాలో వడగాళ్ల వాన కురిసినట్లు అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసినట్లు తెలిపారు. శనివారం రాష్ట్రంలోని నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట,జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే విధంగా ఆదివారం నిజామబాద్, రాజన్న సిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి, ములుగు, భదాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు రెండు రోజులు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

