పీవీ పేద ప్రజల పెన్నిధి : గవర్నర్ తమిళిసై
పీవీ నరసింహారావు | మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుభాకాంక్షలు

హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొని ప్రసంగించారు. మహా నేత పీవీ నరసింహారావు శత జయంతి.. గొప్ప పండుగ రోజు అని పేర్కొన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలకు హాజరు కావడం సంతోషంగా ఉంది. పీవీ భారతదేశ మాజీ ప్రధాని, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, పేద ప్రజల పెన్నిధి అని తెలిపారు.
పీవీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కర్త అని గవర్నర్ చెప్పారు. పీవీ కాంస్య విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం, పీవీ మార్గ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ ఆవిష్కరించిన పీవీ పుస్తకాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతాయన్నారు. పీవీ రచనలను అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. పీవీ రాజకీయాలకు అతీతంగా గౌరవించుకోదగిన వ్యక్తి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పేవారని తమిళిసై గుర్తు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

