అమెరికాలో పీవీ విగ్రహం

అట్లాంటాలో స్థల పరిశీలన
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటు చేయనున్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రపంచంలోని ఐదు దేశాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శత జయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు బిగాల మహేశ్ గుప్తా ఆధ్వరంలో అమెరికాలోని అట్లాంటాలో పీవీ విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఇందుకు అట్లాంటాలోని భారతీయ, తెలుగు సంస్థల ప్రతినిధులు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిగాల మహేశ్ గుప్తా మాట్లాడుతూ.. పీవీ విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించామని, పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావుతో చర్చించి నవంబర్లో విగ్రహం ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. అట్లాంటాలో గాంధీ విగ్రహాన్ని ఏ ర్పాటు చేశామన్నారు. విగ్రహ ఆవిష్కరణకు తెలంగాణ నుంచి ప్రముఖులను, పీవీ కుటుంబసభ్యులను ఆహ్వానించనున్నట్టు తెలిపారు. ఐఏసీఏ వ్యవస్థాపక సభ్యుడు పాడిశర్మ ఆధ్వర్యం లో జరిగిన సమావేశంలో తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, అమెరికన్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు చాంద్ అక్కినేని, ఐఎఫ్ఏ చైర్మన్ సునీల్ సవిలి, టీఆర్ఎస్ పార్టీ అట్లాంటా సలహాదారు రామడుగు శివకుమార్, జనార్దన్ పన్నెల, సందీప్ గుండ్ల, గణేశ్, శ్రీనివాసులు రామిశెట్టి, కీర్తిధర్ గౌడ్ చకిలం పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- idle
- PV Narasimha Rao
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

