హైదరాబాద్ : మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకుగాను పుట్ట మధుకర్ (Putta Madhukar ) దంపతులు సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను జడ్పీచైర్మన్, అభ్యర్థి పుట్టమధుకర్, మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. బీఆర్ఎస్ టికెట్ తో వెళ్తున్న పుట్ట మధుకర్ మంథని నియోజక వర్గంపై గులాబీ జెండా ఎగురవేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ప్రజల మెప్పుతో విజయఢంకా మోగించాలని ఆదేశించారు.
మంథని బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు క్రమశిక్షణతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పుట్ట మధుకర్ మాట్లాడుతూ తనపై నమ్మకం, విశ్వాసంతో టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజయం సాధించి తిరిగి వస్తానని సీఎంకు హామీ ఇచ్చారు.