Gadwala | పల్లీలు కొని కోట్లకు ఎగనామం పెట్టాడు.. షోలాపూర్ వ్యాపారి చేతివాటం!
ఓ వ్యాపారి కోట్లాది రూపాయల విలువైన పల్లీలు (వేరుశనగ) కొనుగోలు చేసి.. వాటికి డబ్బులు చెల్లించకుండా ఎగనామం పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొన్నేండ్లుగా పల్లీల వ్యాపారం చేస్తున్నాడు. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని వ్యాపారుల నుంచి జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెద్ద మొత్తంలో పల్లీలు కొనుగోలు చేశాడు.
- లబోదిబోమంటున్న గద్వాల వ్యాపారులు
- తెలుగు రాష్ర్టాల్లో వంద కోట్లకు పైగా కుచ్చుటోపీ!
Gadwala | గద్వాల అర్బన్, జూలై 21 : ఓ వ్యాపారి కోట్లాది రూపాయల విలువైన పల్లీలు (వేరుశనగ) కొనుగోలు చేసి.. వాటికి డబ్బులు చెల్లించకుండా ఎగనామం పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొన్నేండ్లుగా పల్లీల వ్యాపారం చేస్తున్నాడు. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని వ్యాపారుల నుంచి జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెద్ద మొత్తంలో పల్లీలు కొనుగోలు చేశాడు. నెలరోజుల్లో డబ్బులు చెల్లించాల్సి ఉండగా కనిపించకుండా వెళ్లిపోయాడు. డబ్బుల కోసం వ్యాపారికి ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో వ్యాపారులు షోలాపూర్‌కు వెళ్లి డబ్బులు చెల్లించాలని సదరు వ్యక్తిని నిలదీశారు. ‘నా దగ్గర లేవు.. డబ్బులు ఉన్నప్పుడు చెల్లిస్తా’ అని నమ్మబలికాడు. నెలల గడుస్తున్నా.. ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలో ఆ వ్యక్తి గురించి అసలు విషయం బయటపడింది.
ఈ వ్యాపారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు రూ.100 కోట్లకు పైగా పల్లీలు కొనుగోలు చేసి నగదు చెల్లించకుండా తిరుగుతున్నట్టు తెలిసింది. గద్వాల మార్కెట్లో దాదాపు 15 మంది వ్యాపారులకు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.50 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ డబ్బులను ఎలాగైనా రాబట్టుకోవాలని వ్యాపారులు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. తాము అప్పు చేసి వ్యాపారం చేస్తున్నామని, సదరు వ్యాపారిని నమ్మి పల్లీలు అమ్మితే నిలువునా మోసం చేశాడని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ వ్యవహారంలో గద్వాలకు చెందిన ఓ వ్యాపారికి అత్యధికంగా రూ.1.75 కోట్లు ఇవ్వాల్సి ఉండటంతో తన పరిస్థితి ఘోరంగా ఉన్నదని గంజ్ అసోసియేషన్ సభ్యుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

