సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం : భిక్షంగౌడ్
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పీఆర్టీయూ రాష్ట్ర నూతన అధ్యక్షుడు, పీఆర్టీయూటీఎస్ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భిక్షంగౌడ్ విమర్శించారు.
రామగిరి, అక్టోబర్ 16: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పీఆర్టీయూ రాష్ట్ర నూతన అధ్యక్షుడు, పీఆర్టీయూటీఎస్ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భిక్షంగౌడ్ విమర్శించారు. నల్లగొండలో రెండురోజులపాటు నిర్వహించిన పీఆర్టీయూటీఎస్ 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా భిక్షంగౌడ్ మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించి పరిష్కారానికి కృషిచేయడమే తన లక్ష్యమని చెప్పారు.
కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. జీతాలు చెల్లింపు, ప్రమోషన్లు, పెండింగ్ సమస్యల పరిష్కారంలో విఫలమైందని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం పనిచేసే తనకు పట్టభద్రులు మద్దతుగా నిలిచి ఎమ్మెల్సీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. 72,457మంది ఆన్లైన్ సభ్యత్వంతో పీఆర్టీయూ దేశంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా గుర్తింపు పొందిందని చెప్పారు.
నూతన అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్, ఫ్రధాన కార్యదర్శి మాధుసూదన్రెడ్డికి అభినందనలు తెలిపారు. పీఆర్టీయూటీఎస్ అభ్యర్ధి సుంకరి భిక్షంగౌడ్ విజయానికి ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర పెన్షనర్స్ సంఘం అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, సంఘం అదికార ప్రతినిధి మంగ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, ఆడిట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కాళం నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి మేకల జాన్‌రెడ్డి, అబ్బగోని నాగయ్య, 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా మండల నాయకులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

