FRO | పురుగుల మందు తాగి చావండి.. డబ్బులు నేనిస్తా!
అటవీ అధికారి అవమానించడంతో మనస్తాపం చెందిన ఓ గిరిజన రైతు మందు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం రేంజ్‌లోని గడ్డంగూడలో గురువారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. గడ్డంగూడలో గిరిజనులు వేసుకున్న గుడిసెలను రెండు రోజుల క్రితం అటవీ అధికారులు తొలగించారు.
- గడ్డంగూడవాసులపై ఎఫ్ఆర్వో ఫైర్
- మందు గుళికలు మింగిన రైతు
- జన్నారం రేంజ్ కార్యాలయానికి తరలించి ఆందోళన
- ఆపై లక్షెట్టిపేట దవాఖానకు
- అధికారుల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
FRO | జన్నారం, ఫిబ్రవరి 20 : అటవీ అధికారి అవమానించడంతో మనస్తాపం చెందిన ఓ గిరిజన రైతు మందు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం రేంజ్‌లోని గడ్డంగూడలో గురువారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. గడ్డంగూడలో గిరిజనులు వేసుకున్న గుడిసెలను రెండు రోజుల క్రితం అటవీ అధికారులు తొలగించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గడ్డంగూడకు సిబ్బందితో చేరుకున్న ఎఫ్ఆర్వో సుష్మారావు.. ‘ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. వెంటనే ఖాళీ చేయాలి. లేదంటే సామాన్లను రేంజ్ కార్యాలయానికి తరలిస్తాం’ అని రైతులను హెచ్చరించారు. 3 రోజులు గడువు ఇవ్వాలని వారు కోరగా.. ‘పురుగుల మందు తాగి చావండి.. డబ్బులు లేకుంటే నేనిస్తా’ నంటూ పోలీసుల ముందే దూషించడంతో కాలనీకి చెందిన రైతు రాథోడ్ తుకారాం విషగుళికలు మింగాడు. అతడిని కుటుంబ సభ్యులు, గూడెం వాసులు జన్నారం రేంజ్ కార్యాలయానికి తరలించి ఆందోళన చేపట్టారు. తుకారాం పరిస్థితి విషమించడంతో పోలీసులు వారికి నచ్చజెప్పి లక్షెట్టిపేట దవాఖానకు తరలించారు. ఆందోళనలో బోడ శంకర్, వసంత్‌రావు, పంతుల్యా, రాజు, రాంచందర్, జైతురావ, రమేశ్, శివ, రాథోడ్ లక్ష్మీబాయి, మన్నీబాయి, జగదీశ్ పాల్గొన్నారు.
అధికారులు ఓవర్ యాక్షన్ ఆపండి: సీతక్క

అటవీశాఖ అధికారులు ఆంక్షల పేరిట ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఓవర్ యాక్షన్ ఆపాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా జన్నారంలోని పైడిపెల్లి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. టైగర్ జోన్ పేరుతో ఈ ప్రాంత ప్రజలను అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, చెక్‌పోస్ట్‌ల వద్ద వాహనాలను నిలిపివేయడం వల్ల వాహనదారులకు నష్టం జరుగుతుందని అన్నారు. పదేండ్లలో లేని ఆంక్షలు ఈ ఒక్క సంవత్సరంలో ఎలా వచ్చాయని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

