నిజాంపేట అక్టోబర్8 : కరెంటు కోతలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి నిజాంపేట ప్రధాన రహదారిపై రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే కష్టాలని నిరంతర కరెంటు సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. నాణ్యమైన కరెంటు సరఫరా చేయకపోవడంతో లో ఓల్టేజ్ తో పొలాల కాడ మోటర్లుకాలిపోతున్నాయని, పొట్ట దశలో ఉన్న వరి ఎండిపోతుంటే రైతుల గుండెలు పగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మొన్నటి వరకు యూరియా సమస్యతో సతమతమవుతున్న రైతుకు కరెంటు సమస్య పెనుభూతంగా మారిందన్నారు. స్వచ్ఛమైన 24 గంటల కరెంటు అందించేంతవరకు బీఆర్ఎస్ పార్టీ తరపున జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్ లను ముట్టడిస్తామని హెచ్చరించారు. రోడ్డుపై గంటపాటు సాగిన రాస్తారోకోతో సుమారు కిలోమీటర్ మేర వాహనాలు ఎక్కడికి అక్కడ ఆగిపోయినాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని రైతులను, నాయకులను సముదాయించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్లు అందే కొండల్ రెడ్డి కనకరాజు, మాజీ ఎంపీపీ సంపత్, బి ఆర్ ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మౌరం రాజు, మాజీ ఎంపిటిసిలు వెంకటస్వామి బాల్రెడ్డి నాయకులు రంజిత్ గౌడ్, మండల కో ఆప్షన్ మాజీ సభ్యుడు అబ్దుల్ తదితరులు ఉన్నారు.