ప్రకృతి రక్షణే ప్రాణాధారం

- ప్రకృతిని ఊహించు, సృష్టించు, పునరుద్ధరించు..
- ఈ ఇతివృత్తంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం
కండ్లముందు కనిపిస్తున్న హరితహారం ఫలాలు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణతోనే భూమిపై జీవకోటి మనుగడ సాధ్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి, ఈపీటీఆర్ఐ శనివారం సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతితో జీవకోటికి విడదీయరాని సంబంధం ఉన్నదని అన్నారు. మనిషి ప్రకృతిని కాపాడితే అది అన్ని జీవరాశుల్ని కాపాడుతుందని చెప్పారు. ఈ ఏడాది ‘ప్రకృతిని ఊహించు, సృష్టించు, పునరుద్ధరించు’ అనే ఇతివృత్తంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, దీని లక్ష్యాన్ని సీఎం కేసీఆర్ ఎప్పుడో గుర్తించారని తెలిపారు. అభివృద్ధి పర్యావరణ హితంగా ఉండాలని భావించిన సీఎం, ప్రకృతి వనరులను కాపాడేందుకు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. హరితహారం ఫలితాలు ఇప్పుడు రాష్ట్రమంతా మన కండ్లముందు కనిపిస్తున్నాయని చెప్పారు. సమావేశంలో ఈపీటీఆర్ఐ డీజీ అధర్‌సిన్హా, పర్యావరణ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి నీతూకుమారిప్రసాద్, ఈపీటీఆర్ఐ కోఆర్డినేటర్ డాక్టర్ సునీల తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

