Bogata Waterfalls | భారీ వర్షాలు.. బొగత వాటర్ ఫాల్స్ వద్ద నిషేధాజ్ఞలు..!
Bogata Waterfalls | రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుశాయి. ములుగు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. జయశంకర్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.
Bogata Waterfalls | రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుశాయి. ములుగు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. జయశంకర్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు ములుగు జిల్లాలో బొగత వాటర్ ఫాల్స్ వద్ద భారీగా వరద పెరిగింది. తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాజేడు మండలం వద్ద ఉధృతంగా బొగత జలపాతం వరద పరవళ్లు తొక్కుతున్నది.
దాంతో అధికారులు అప్రమత్తమై వాటర్ ఫాల్స్ వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పర్యాటకులను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో ములుగు జిల్లాలో భారీగా వర్షపాతం నమోదైంది. వెంకటాపురంలో అత్యధికంగా 25 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. అలాగే, ఏటూరునాగారంలో 18.4, మంగపేటలో 15.8, అలుబాక(జెడ్)లో 14.9, గోవిందరావుపేటలో 12.3, వెంకటాపూర్లో 8.9, లక్ష్మీదేవిపేటలో 9.3, వాజేడులో 7.2, ములుగు మండలం మల్లంపల్లిలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యిందని వాతావరణశాఖ తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

