కలిసి ఉంటే సమస్యలు పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
ప్రజలు కలిసి మెలసి ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తొర్రూరు : ప్రజలు కలిసి మెలసి ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా తొర్రూరు గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన శ్రీ కంఠమహేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం, జాతర వేడుకల్లో మంత్రి పాల్గొని పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కంఠమహేశ్వర స్వామి కృపతో గౌడ సంఘం సభ్యుల సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి రూ.5 లక్షలు ఇచ్చానని గుర్తు చేశారు. మున్సిపాలిటీ నుంచి రోడ్డు, బ్రిడ్జి, ఆలయ అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేయిస్తానని వెల్లడించారు. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లాకు పర్యటించిన సందర్భంగా మున్సిపాలిటీకు రూ. 25 కోట్లు ప్రకటించారని తెలిపారు. స్థలం ఉంటే కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని పేర్కొన్నారు.
పర్వతగిరిలో కాకతీయుల కాలం నాటి శివాలయాన్ని పునః ప్రతిష్ట చేస్తున్నామని ఈ కార్యక్రమానికి గ్రామస్థులంతా తరలి రావాలని కోరారు. పాపాలు చేసినోళ్లు సుఖాలు అనుభవించడం తాత్కాలికమేనని వివరించారు. ప్రజలకు చేసే మంచి పని శాశ్వతంగా నిలుస్తుందని ,అదే మీ పిల్లలకు, కుటుంబానికి ఉపయోగపడుతుందని హితవు పలికారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

