పంచాయతీరాజ్ శాఖలో 529 పోస్టుల భర్తీకి సన్నాహాలు
- జెడ్పీల్లో 467.. డీపీవోల్లో 62
- జిల్లాలవారీగా విభజన పూర్తి
- సిద్దిపేటకు అత్యధికంగా 34
- ఖాళీలు లేని ఖమ్మం జిల్లా
- ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతులు
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ)ః రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖకు ఆర్థికశాఖ ఇటీవల 529 పోస్టులను మంజూరుచేసిన నేపథ్యంలో ఆయా పోస్టులను వివిధ జిల్లాలకు విభజిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పరిషత్తు (జెడ్పీ), జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో (డీపీవో) వివిధ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో జెడ్పీ సూపరిటెండెంట్ పోస్టులు 103, జెడ్పీ సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 151, జెడ్పీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 213 ఉన్నాయి. వీటితోపాటు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 22, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 40 మంజూరు అయ్యాయి. వీటిలో కొన్నింటిని నేరుగా, మరి కొన్నింటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 34, సంగారెడ్డి, నిర్మల్, నాగర్‌కర్నూల్, మెదక్ జిల్లాలకు 27 పోస్టుల చొప్పున మంజూరయ్యాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

