గ్రూప్-1పై నేడు అప్పీల్
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి తీర్పుపై టీఎస్పీఎస్సీ సోమవారం డివిజన్‌ను ఆశ్రయించనున్నది. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తీరు, పరీక్ష నిర్వహణకు చేపట్టిన జాగ్రత్తలు తదితర అంశాలతో అప్పీల్‌కు వెళ్లనున్నది.
- హైకోర్టు డివిజన్ బెంచ్‌లో టీఎస్పీఎస్సీ పిటిషన్
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి తీర్పుపై టీఎస్పీఎస్సీ సోమవారం డివిజన్‌ను ఆశ్రయించనున్నది. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తీరు, పరీక్ష నిర్వహణకు చేపట్టిన జాగ్రత్తలు తదితర అంశాలతో అప్పీల్‌కు వెళ్లనున్నది. ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించినట్టు సమాచారం. నిరుడు అక్టోబర్ 16న తొలిసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసిన టీఎస్పీఎస్సీ.. ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన పరీక్షలో బయోమెట్రిక్‌ను ఎందుకు అమలు చేయలేదన్న విషయంపై డివిజన్ బెంచ్‌కు స్పష్టత ఇవ్వనున్నది. ప్రిలిమ్స్‌కు హాజరైన 2,33,506 మంది అభ్యర్థుల్లో కేవలం ముగ్గురి కోసం పరీక్షను మళ్లీ వాయిదా వేస్తే మిగిలిన 2,33,503 మంది ఇబ్బంది పడతారని, వారిపై ఆర్థిక భారం పడటంతోపాటు ఎంతో విలువైన సమయం వృథా అవుతుందనే విషయాన్ని ప్రధానంగా ప్రసావించబోతున్నది. గ్రూప్-1 ఉద్యోగానికి ప్రిలిమినరీ పరీక్షే ప్రధానం కాదని, మెయిన్స్ పరీక్ష కూడా ఉన్నదనే విషయాన్ని బలంగా వినిపించాలని కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది.
యూపీఎస్సీలోనూ బయోమెట్రిక్ లేదు
ఉద్యోగ నియామక పరీక్షకు తొలిసారి టీఎస్పీఎస్సీయే ప్రయోగాత్మకంగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. సివిల్ సర్వీస్ నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే పరీక్షల్లోనూ ఈ విధానం లేదు. నిరుడు అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ సమయంలో బయోమెట్రిక్ హాజరు తీసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అభ్యర్థుల్లో చాలా మంది ఒకేసారి పరీక్షా కేంద్రాలకు రావడం, సమయం సరిపోకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణం. వీటిని పరిగణనలోకి తీసుకున్న టీఎస్పీఎస్సీ రెండోసారి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించినప్పుడు అభ్యర్థుల సౌలభ్యం కోసమే బయోమెట్రిక్ విధానాన్ని తొలగించింది. ఈ విషయాన్ని అభ్యర్థులందరికీ ముందుగానే తెలియజేయడంతోపాటు ప్రతి పరీక్షా కేంద్రంలో పకడ్బందీగా మూడంచెల తనిఖీలు చేపట్టింది. పరీక్ష జరిగిన రోజు ప్రాథమిక సమాచారం మేరకే అభ్యర్థుల సంఖ్యను తెలిపిన టీఎస్పీఎస్సీ.. ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ తర్వాత మొత్తం అభ్యర్థుల సంఖ్యను ప్రకటించింది. ఈ అంశాలను కూలంకషంగా హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వివరించాలని కమిషన్ భావిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

