కరోనా టీకాలకు గ్లోబల్ టెండర్లు.. నేడు ప్రీబిడ్
గ్లోబల్ టెండర్లు| రాష్ట్రంలో కరోనా టీకాల పంపిణీ టెండర్లకు సంబంధించి ప్రభుత్వం నేడు ప్రీబిడ్ నిర్వహించనుంది. కొవిడ్ టీకాల కోసం ఈనెల 19 గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నది.

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టీకాల పంపిణీ టెండర్లకు సంబంధించి ప్రభుత్వం నేడు ప్రీబిడ్ నిర్వహించనుంది. కొవిడ్ టీకాల కోసం ఈనెల 19 గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నది. దీనికి సంబంధించి బుధవారం ప్రీబిడ్ నిర్వహించనుంది. సమావేశానికి పలువురు ఉత్పత్తిదారులు పాల్గొననున్నారు. టీకాల పంపిణీపై ఆసక్తి ఉన్న తయారీదారులు తమ సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం.
రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత సమస్యను పరిష్కరించడానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ టీఎస్ఎంఐడీసీ విధివిధానాలను ఈ నెల 19న జారీ చేసింది. కోటి వ్యాక్సిన్ డోసులను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుందని టెండర్ నియమాల్లో పేర్కొంది. అర్హులైన వారు టీఎస్ఎంఐడీసీ అధికారిక వెబ్సైట్ నుంచి టెండర్ ఫామ్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రకటనలో వెల్లడించింది. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనాలనుకునే వారు తప్పక వారి దరఖాస్తులను ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
మే 21 నుంచి జూన్ 4 వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నది. జూన్ 4న సాయంత్రం 6.30 గంటలలోపు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే టెండర్ ప్రక్రియలో పాల్గొనే అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. మొత్తం 180 రోజుల వ్యవధిలో టెండర్లకు ప్రభుత్వం ఆహ్వానం పలికింది. నెలకు కనీసం 15 లక్షల డోసుల చొప్పున 6 నెలల్లో టీకా డోసులు ఇవ్వాలని టెండర్ నియమాల్లో పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

