కేసీఆర్తో పొన్నాల భేటీ
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్తో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆదివారం ప్రగతిభవన్లో భేటీ అయ్యారు. పొన్నాల లక్ష్మయ్య, అరుంధతి దంపతులను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.
- సాదరంగా స్వాగతించిన ముఖ్యమంత్రి నేడు జనగామ సభలో బీఆర్ఎస్లో చేరిక
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్తో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆదివారం ప్రగతిభవన్లో భేటీ అయ్యారు. పొన్నాల లక్ష్మయ్య, అరుంధతి దంపతులను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, దేశ రాజకీయాలపై ముచ్చటించారు. పొన్నాల యోగక్షేమాలను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, పార్టీ నేత దోసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. పొన్నాల సోమవారం బీఆర్ఎస్లో చేరనున్నారు. జనగామలో బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగసభలో అధినేత, సీఎం కేసీఆర్.. పొన్నాల లక్ష్మయ్యకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగసభకు హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో పొన్నాలను తనవెంట తీసుకెళ్లనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

