ఆదివాసీల దిగ్బంధం… ప్రజాభవన్ ముట్టడికి యత్నం .. కాలనీలోనే అడ్డుకున్న పోలీసులు
ప్రజాభవన్ ముట్టడికి బయలుదేరిన ఆదివాసీలను పోలీసులు దిగ్బంధించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. ఆదిలాబాద్ పట్టణంలోని సర్వే నంబర్ 72 ప్రభుత్వ స్థలంలో 400 కుటుంబాలు 20 ఏండ్లుగా నివాసం ఉంటున్నాయి.
- ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం కాలనీవాసులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్
ఆదిలాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ) : ప్రజాభవన్ ముట్టడికి బయలుదేరిన ఆదివాసీలను పోలీసులు దిగ్బంధించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. ఆదిలాబాద్ పట్టణంలోని సర్వే నంబర్ 72 ప్రభుత్వ స్థలంలో 400 కుటుంబాలు 20 ఏండ్లుగా నివాసం ఉంటున్నాయి. ఆ ప్రాంతానికి వారు కుమ్రం భీం కాలనీగా నామకరణం చేసుకున్నారు. అక్కడ నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలని చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. గతంలో జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి సైతం పట్టాల సమస్యను తెలియజేశారు.
ఎవరూ పట్టించుకోకపోవడంతో మంగళవారం ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. సోమవారం కాలనీవాసులు హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీ సంఖ్యలో కాలనీకి చేరుకొని ఆదివాసీలను అడ్డుకున్నారు. తుడుందెబ్బ నాయకులు, కాలనీవాసులను పోలీసులు అరెస్ట్ చేసి మావల పోలీస్ స్టేషన్కు తరలించారు. రెవెన్యూ అధికారులు వచ్చి మాట్లాడటంతో వారిని విడుదల చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని అడిషనల్ కలెక్టర్ చిత్రు హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

