హైదరాబాద్ : పోక్సో(POCSO) కేసు నిందితుడు బండి భగీరథ్ స్నేహితులను పోలీసులు విచారించారు. ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో అతడి స్నేహితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాగా, బాలికపై లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
నార్సింగిలోని పోలీసు అకాడమీ వద్ద శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో భగీరథ్‌ను అరెస్టు చేసినట్టు సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేశ్‌రెడ్డి వెల్లడించారు. దీంతో 9 రోజుల హైడ్రామాకు తెరపడింది. తన మైనర్ కుమార్తెను బండి భగీరథ్ లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తూ ఆమె తల్లి ఈ నెల 8న పేట్‌బషీరాబాద్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.