ఢిల్లీలో అవార్డులిచ్చి..గల్లీలో తిట్టుడేంది?
ఢిల్లీలో తెలంగాణకు అవార్డులు ఇచ్చి గల్లీలో తిట్టడం కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఒక ప్రకటనలో విమర్శించారు.
- కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యలు సరికాదు
- పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో తెలంగాణకు అవార్డులు ఇచ్చి గల్లీలో తిట్టడం కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఒక ప్రకటనలో విమర్శించారు. పదేండ్లలో తెలంగాణ అభివృద్ధి చెందలేదన్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో దేశంలోనే రాష్ట్రం ముందున్న విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. వారు రాష్ర్టానికి వచ్చిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలడం, అసత్యాలు మాట్లాడటం అలవాటుగా మారిందని తెలిపారు. రాష్ట్రానికి ఎవరొచ్చినా సీఎం కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఆయన రాష్ట్రంలో అమలు చేస్తున్న ఎన్నో పథకాలకు ఏటా అదే పెద్దలు అవార్డులు ఇచ్చిన విషయాన్ని మరువొద్దని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం బీజేపీ పోరాడిందన్న రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని, తెలంగాణలో ఆ పార్టీకి అధికారమనేది అందని దాక్షేనని పేరొన్నారు. మూడోసారీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం తథ్యమని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

