ORR | పెద్ద అంబర్‌పేట ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. పార్థి గ్యాంగ్ అరెస్ట్
జాతీయరహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్‌పేట సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డు (ORR) వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది.
హైదరాబాద్: జాతీయరహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్‌పేట సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డు (ORR) వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది. ఇటీవల నేషనల్ హైవేవై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా వరుస చోరీలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అప్రమత్తమైన నల్లగొండ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వెంబడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వచ్చిన తర్వాత ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. రాచకొండ, నల్లగొండ సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా దొంగలను పట్టుకునేందుకు యత్నించారు. దీంతో వారిపై దొంగలు కత్తులతో ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం నలుగురు దొంగలను అదపులోకి తీసుకున్నారు. వారిని నల్లగొండకు తరలించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

