లాక్డౌన్, కరోనా నిబంధన అమలులో పోలీసుల పనితీరు భేష్ : హైకోర్టు
పోలీసుల పనితీరు భేష్ | రాష్ట్రంలో లాక్డౌన్, కరోనా నిబంధనల అమలు తీరులో పోలీసుల పనితీరు భేషుగ్గా ఉందని హైకోర్టు ప్రశంసించింది. భవిష్యత్‌లోనూ ఇదే రీతిలో పనిచేయాలని సూచించింది.

హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్డౌన్, కరోనా నిబంధనల అమలు తీరులో పోలీసుల పనితీరు భేషుగ్గా ఉందని హైకోర్టు ప్రశంసించింది. భవిష్యత్‌లోనూ ఇదే రీతిలో పనిచేయాలని సూచించింది. తెలంగాణలో లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ, కరోనా నిబంధనల అమలు తీరుపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. విచారణకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలు హాజరయ్యారు. లాక్డౌన్, కరోనా నిబంధనల అమలు తీరుపై డీజీపీ కోర్టుకు నివేదిక సమర్పించారు.
‘‘ఔషధాల బ్లాక్ మార్కెట్‌పై 98 కేసులు నమోదు చేశాం. ప్రభుత్వ దవాఖాన వద్ద 57 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ నెల 1 నుంచి 14 వరకు 4,31,823 కేసులు నమోదు చేశాం. మాస్కులు లేని వారిపై 3,39,412 కేసులు నమోదు చేసి రూ. 31 కోట్ల జరిమానా విధించాం. భౌతికదూరం పాటించనందుకు 22,560 కేసులు నమోదు చేశాం. కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనపై 26,082 కేసులు పెట్టాం’’ అని డీజీపీ వెల్లడించారు. రాష్ట్రంలో లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసుల పనితీరును అభినందించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

