కరోనా నిబంధనల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు : డీజీపీ
నిబంధనల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు | రాష్ట్రంలో కరోనా నిబంధనల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. 859 పెట్రోలింగ్ వాహనాలు, 1,523 ద్విచక్ర వాహనాలపై సిబ్బంది నిబంధనలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నిబంధనల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. 859 పెట్రోలింగ్ వాహనాలు, 1,523 ద్విచక్ర వాహనాలపై సిబ్బంది నిబంధనలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. విచారణకు డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా కట్టడికి పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యలను ఆయన కోర్టుకు విన్నవించారు. ఆసుపత్రుల వద్ద పోలీసుల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
భౌతికదూరం పాటించని సంస్థలపైనే కేసులు నమోదు చేస్తున్నామని, వ్యక్తులపై నమోదు చేయడం లేదని పేర్కొన్నారు. ఔషధాల అక్రమ విక్రయాలకు సంబంధించి 39 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

