చిన్న కాలేజీలో చేరినా.. పెద్ద కాలేజీలో చదువొచ్చు

- డిగ్రీస్థాయిలో క్లస్టర్ విధానం అమలుకు యోచన
- 6 కాలేజీలకు ఒకటి చొప్పున క్లస్టర్ ఏర్పాటు
- తొలుత పైలట్ ప్రాజెక్టు.. ఆ తర్వాతే రాష్ట్రమంతా
- మార్గదర్శకాలు రూపొందిస్తున్న ఉన్నత విద్యామండలి
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఒక విద్యార్థికి ఇంటర్లో 90 శాతం మార్కులు వచ్చాయి. డిగ్రీలో తనకు కచ్చితంగా నిజాం కాలేజీలో సీటు వస్తుంది, అక్కడే క్లాసులు వినాలన్న ఆశతో దరఖాస్తు చేసుకున్నాడు. మెరిట్ విద్యార్థులంతా పోటీపడటంతో ఆ కాలేజీలో సీటు రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అదే కాలేజీకి సమీపంలోని మరో కాలేజీలో చేరాడు. ఇప్పుడా విద్యార్థి ఆశ క్లస్టర్ విధానంతో నెరవేరనుంది. తాను ఆశపడ్డ నిజాం కాలేజీలో కొంతకాలంపాటు తరగతులు వినే అవకాశం కలగనుంది. చిన్న కాలేజీల్లో చేరినా పెద్ద కాలేజీలో క్లాసులు వినే అవకాశాన్ని కల్పిస్తున్నదే క్లస్టర్ విధానం. రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్న క్లస్టర్ విధానం మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నత విద్యామండలి అధికారులు నిమగ్నమయ్యారు. విద్యామండలి వైస్చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, పలువురు వీసీలతో ఏర్పాటుచేసిన కమిటీ ఇటీవలే సమావేశమై క్లస్టర్ల ఏర్పాటుపై చర్చించింది. దీనిని మొదట పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి, తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని కాలేజీలను కలుపుతూ పైలట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
6 కాలేజీలకు ఒక క్లస్టర్..
ఒక క్లస్టర్లో కనీసం 6 కాలేజీలు ఉంటే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. రెండు వర్సిటీ అనుబంధ కాలేజీలు, రెండు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, మరో రెండు వర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీలను కలుపుతూ క్లస్టర్‌ను ఏర్పాటుచేసే అవకాశం ఉన్నది. డిగ్రీ కాలేజీలతోపాటు ఐఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సహా పలు వర్సిటీలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలను క్లస్టర్ విధానంలో అనుసంధానం చేయాలని యోచిస్తున్నా రు. ఒక కాలేజీలో పనిచేస్తున్న బోధనా సిబ్బంది కొంతకాలం క్లస్టర్‌లోని మరో కాలేజీలో బోధించేలా ఏర్పాట్లుచేస్తారు. ల్యాబ్‌లు, కోర్సుల కురికులం, మెటీరియల్, గ్రంథాలయాలను పరస్పరం వాడుకొంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

