Petrol Bunk | రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ముంచుకొస్తున్నది. పెట్రోల్, డీజిల్ కొరతతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక బంకులు మూతపడగా.. ఎక్కడ చూసినా బంకుల ముందు నోస్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. బుధవారం కూడా అలాంటి పరిస్థితే కనిపించడంతో పెట్రోల్, డీజిల్ దొరకదేమోనని వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. తీసి ఉన్న బంకుల్లో పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. దొరికిన చోట తమ వాహనాల్లో ట్యాంక్‌ఫుల్ చేయించుకుంటున్నారు. దీనికి తోడు బాటిళ్లలోనూ స్టాక్ పెట్టుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 3,600 పెట్రోల్ బంకులు ఉండగా, రోజూ సుమారు 35 లక్షల లీటర్ల పెట్రోల్, 45 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతాయి. డిమాండ్‌కు తగ్గట్టు పెట్రోల్, డీజిల్‌ను ఆయిల్ కంపెనీలు సరఫరా చేయడం లేదంటూ ఆయా బంకుల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే స్టాక్ సరఫరాలో అనధికారిక కోతలు విధిస్తున్నాయని చెప్పారు. అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేకపోయినా సరఫరాలో అంతర్గత కోతలు పెడుతున్నట్టుగా చెప్తున్నారు. ఇందుకోసం పలురకాల షరతులు విధిస్తున్నారని చెప్తున్నారు. మొన్నటివరకు స్టాక్ కావాలంటే అడ్వాన్స్ పేమెంట్ చేయాలని ఆదేశించారని, ఆ తర్వాత స్టాక్ కావాలంటే ఒకరోజు ముందే పేమెంట్ చేయాలన్నారని, తాజాగా తామే ఆన్లైన్ మానిటరింగ్ చేసి.. సరఫరా చేస్తామని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయని తెలిపారు. ఇందులో భాగంగానే ఒక బంకులో స్టాక్ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితిలోనే సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ ఏదైనా కారణాలతో అప్పటికీ స్టాక్ రాకపోతే బంకును మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. దీంతోపాటు ఎప్పటికప్పుడు సేల్, స్టాక్ వివరాలు పంపాలని బంకుల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది.
యుద్ధ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభం
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు
హైదరాబాద్‌లో పలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు.. గంటల తరబడి లైన్లో వేచి చూస్తున్న వాహనదారులు
కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు
కొన్ని… https://t.co/4Wabing6Eq pic.twitter.com/gJjPMmkd1h
— Telugu Scribe (@TeluguScribe) March 25, 2026
ఇదీ పెట్రోల్, డీజిల్ బంకుల దగ్గర పరిస్థితి pic.twitter.com/75UGpaGSqS
— Telugu Scribe (@TeluguScribe) March 25, 2026
Petrol | పెట్రోల్, డీజిల్ కొరతతో రాష్ట్రవ్యాప్తంగా వాహనదారుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందించింది. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. సోషల్‌మీడియాలో వస్తున్న ప్రచారాలతో తప్పుడు ప్రచారాల కారణంగా ప్రజలు అనవసరంగా పెట్రోల్ బంకులను పరుగులు తీస్తూ, ట్యాంకులు నింపుకుంటున్నారని తెలిపింది. పెట్రోల్ బంకుల ముందు నోస్టాక్ బోర్డులు కనిపించడానికి ప్రధాన కారణం తప్పుడు వదంతులు నమ్మి ఒకేసారి జనాలు ఎగబడటమేనని తెలిపారు. అందరూ తమ వాహనాల కోసం పెద్ద ఎత్తున ఇంధనం కొనుగోలు చేస్తుండటంతో కూడా కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ భయాందోళనల కారణంగా సాధారణ స్థాయి కంటే 2.5 నుంచి 3 రెట్లు అధికంగా అమ్మకాలు జరుగుతున్నాయని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా ఇంధన నిల్వలు తగ్గినట్లు కనిపిస్తున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని స్పష్టంచేసింది. HPCL, IOCL, BPCL సంస్థల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని.. సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతుందని తెలిపింది.

Petrol Dealers Associations
పెట్రోల్ లేదా డీజిల్‌ను క్యాన్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని.. ఇది PESO నిబంధనలకు విరుద్ధమని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఇంధనాన్ని తప్పుగా నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం తెలిపింది. భయాందోళనలతో అధికంగా ఇంధనాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని సూచించింది.
హైదరాబాద్ – లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న పెట్రోల్ బంకు ముందు వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం https://t.co/0C8ZB347Sn pic.twitter.com/oWE798VPAc
— Telugu Scribe (@TeluguScribe) March 25, 2026

Petrol Bunk

Petrol Bunk1

Petrol Bunk2

Petrol Bunk3

Philippines Energy Emergenc