Revanth Reddy | ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని అబద్ధాలైనా చెబుతాం.. ప్రజలను మోసం చేయడమే రేవంత్ రెడ్డి ఫిలాసఫీ.. ఇవే దానికి రుజువు!
Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అబద్ధాలకు ఈ రెండు వ్యాఖ్యలు చక్కటి ఉదాహరణ. ఆయన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వంపై చేసిన ఏ ఒక్క ఆరోపణా నిజం కాలేదు..నిలబడలేదు
Revanth Reddy | గుజరాత్ ఎన్నికలతోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తుకు వెళ్తారు నిజం కాలే…
సచివాలయం జీ బ్లాక్ కింద సొరంగం ఉన్నది. అది నిజాం సంపదకు కేంద్రం. భూగర్భంలో వేల కోట్ల నిధి ఉన్నది నిజం కాలే…
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అబద్ధాలకు ఈ రెండు వ్యాఖ్యలు చక్కటి ఉదాహరణ. ఆయన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వంపై చేసిన ఏ ఒక్క ఆరోపణా నిజం కాలేదు..నిలబడలేదు.. ప్రజలు పట్టించుకోనూ లేదు. అయినా, ప్రజలను మోసం చేసేందుకు ఈ అబద్ధాల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో గెలువాలంటే నిజాలు చెప్పకూడదని, ప్రజలను మోసం చేస్తేనే అధికారంలోని వస్తామని ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలోనే బహిరంగంగానే చెప్పారు. ‘మేము ఎన్నికల్లో గెలువాలనుకొంటున్నాం. నిజం చెప్తే ప్రజలు నమ్మరు. మోసం చేస్తేనే నమ్ముతారు. మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకొంటున్నారు. రోగి కోరుకున్నదీ అదే.. డాక్టర్ ఇచ్చింది అదే’.. అని స్పష్టంగా చెప్పారు.
స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ఒక అబద్ధాన్ని పదేపదే చెప్తే కొందరైనా నిజమని నమ్ముతారని ప్రతీతి. కానీ, రోజూ ఒక అబద్ధాన్ని ప్రజలపైకి వదిలి.. నిన్నటి మా టకు నేడు.. నేటి మాటకు రేపు పొంతనలేకుండా మాట్లాడితే ఏమంటారు.. బహుశా ‘రేవంత్’ అంటారేమో.. అబద్ధాలకు బ్రాండ్ అం బాసిడర్‌గా మారారు. చెప్పే ప్రతి మాట అబ ద్ధం. నోటికి వచ్చిందల్లా వాగడం ఆయన నైజం. చెప్పేది అబద్ధమని తెలిసే మాట్లాడుతానని నిస్సిగ్గుగా చెప్తుంటారు.
ఏదేమైనా మీడియాలో ఉండాలి
చంద్రబాబు వారసత్వాన్ని పుణికిపుచ్చుకొన్న రేవంత్, సంచలనం కోసం ఏదైనా మాట్లాడుతారు. మీడియాలో హైలైట్ అయితే చాలు.. అందులో వాస్తవం ఎంత అనేది ఆ యనకు అవసరం లేదు. ఆయనదంతా హిట్ అండ్ రన్ పాలసీ. బురద జల్లి కడుక్కోమని చెప్పే విధానం. ఈ సోషల్ మీడియా యుగం లో ఒక సంచలన ఆరోపణ చేస్తే జనంలోకి త్వరగా వెళ్తుంది. అది తప్పని చెబితే జనంలోకి అంత త్వరగా ఎక్కదు. దీన్నే ఆయన నమ్ముకున్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటారు. దానికి ఖర్చు చేసిందే 80 వేల కోట్లయితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఓఆర్ఆర్ కాం ట్రాక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అం టారు. ఆధారాలు ఉన్నాయా? అంటే నోరెళ్లబెడతారు.కొత్త సచివాలయం కింద గుప్త నిధులున్నాయని అంటారు.. చూపిద్దువు రా! అం టూ తోకముడిచి పారిపోతారు. ఒకటేమిటి.. రేవంత్ నోటివెంట రాని అబద్ధం లేదు.. ఒక్కదానికి కూడా ఆయన నిలబడిందీ లేదు. రేవంత్ మాటల్లో నిజమెంత ఉన్నదో తెలుసుకోవాలంటే.. ఆయన చేసిన వందల ప్రకటనల్లో మచ్చుకు కొన్ని పరిశీలిస్తే సరిపోతుంది.
రేవంత్ అబద్ధాల్లో కొన్ని..
- ఈ ఏడాది మార్చిలోనే అసెంబ్లీ రద్దు వచ్చే ఏడాది డిసెంబర్లో ఎన్నికలు(హైదరాబాద్, మార్చి 5, 2022)నిజం కాలే..
- ఫిబ్రవరి చివర్లో అసెంబ్లీ రద్దు ఏప్రిల్‌లో ఎన్నికలకు సీఎం వ్యూహం (హైదరాబాద్, జనవరి 19, 2023) నిజం కాలే..
- సచివాలయం జీ బ్లాక్ కింద సొరంగం అది నిజాం సంపదకు కేంద్ర బిందువు భూగర్భంలో వేల కోట్ల నిధి ఉన్నది అక్కడి నుంచి ప్రగతి భవన్‌కు సొరంగం
(హైదరాబాద్, జూలై 14, 2020) నిజం కాలే.. - గుజరాత్‌తోపాటే రాష్ట్ర ఎన్నికలు త్వరలోనే ప్రభుత్వం రద్దు (అక్టోబర్ 18, 2021) నిజం కాలే..
- కోకాపేటలో వెయ్యి కోట్ల కుంభకోణం కేసీఆర్ చుట్టాలు రాష్ర్టాన్ని దోచుకొని విదేశాలకు పారిపోయే ప్రయత్నం (హైదరాబాద్, జూలై 17, 2021) రుజువు చేయలే…
- రాజ్యసభలో టీఆర్ఎస్ సభాపక్షం త్వరలో బీజేపీలో విలీనం (హైదరాబాద్, అక్టోబర్ 8, 2022) నిజం కాలే..
- 111 రద్దు వెనుక లక్షల కోట్ల స్కామ్ బీఆర్ఎస్ దోపిడీలో బీజేపీకి వాటా (హైదరాబాద్, మే 23, 2023) రుజువు చేయలే…
- టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కేటీఆర్ పీఏకు సంబంధం అతని మండలంలో 100 మందికి 100కు పైగా మార్కులు (కామారెడ్డి, మార్చి 19, 2023) నిజం కాలే..
- సచివాలయం, అమరవీరుల స్థూపం,అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో కుంభకోణం (హైదరాబాద్, మే 1, 2023) రుజువు చేయలే…
సంచలనం కోసం రేవంత్ చేసిన కొన్ని ప్రకటనలు
- ప్రగతి భవన్ ఉంటే ఏంది? పేలితే ఏంది? (సిరిసిల్ల, మార్చి 4, 2023) ప్రగతిభవన్‌ను నక్సలైట్లు పేల్చేయాలి
- (ములుగు, ఫిబ్రవరి 7, 2023) లాబీయింగ్‌కే కేసీఆర్ ఢిల్లీ యాత్ర ఇదే ఢిల్లీ పర్యటన సారాంశం(హైదరాబాద్, ఆగస్టు 1, 2022)
- కేసీఆర్ రైతు హంతకుడు (హైదరాబాద్, మార్చి 3, 2022)
- కాంగ్రెస్ గెలిస్తే ధరణి రద్దు (హైదరాబాద్, జూలై 6, 2022)
- పీకే సూచనలతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్పత్రి డ్రామాలు (కొల్లాపూర్, మార్చి 13, 2022)
- బీహార్ ముఠాపై నిఘా పెట్టాలి వారి తీరును బయట పెట్టాను రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు (హైదరాబాద్, మార్చి 2, 2022)
9 ఏండ్లలో అభివృద్ధి శూన్యం దళిత, గిరిజనులను మోసం చేశారు (కరీంనగర్, మార్చి 3, 2023) - తోట చంద్రశేఖర్‌కు అప్పన్నంగా 5 వేల కోట్ల భూములు రాసిచ్చారు (మరిపెడ, ఫిబ్రవరి 10, 2023)
- 100 కోట్ల భూమి 17.5 కోట్లకే నజరానాగా ‘నమస్తే తెలంగాణ’కు రాసిచ్చిన బిల్డర్ (హైదరాబాద్, ఏప్రిల్ 12, 2023)
- ధనదాహంతో కేబీఆర్ పార్క్ ధ్వంసం (హైదరాబాద్, ఏప్రిల్ 13, 2023)
- వడ్లు కొనకుంటే ఫాంహౌస్ ముట్టడి దుడ్డుకర్రల సైన్యంతో దాడులు చేస్తాం (ఎల్లారెడ్డి, మార్చి 21, 2023)
- ఉద్యోగాల ప్రకటన ఓ మోసం (హైదరాబాద్, మార్చి 10, 2022)
- ఇక మిల్టెంట్ పోరాటాలే కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం (ఏప్రిల్ 2, 2022)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

