Inter Exams | హైదరాబాద్ : ఇంటర్ పరీక్షలకు హాజరయ్యేందుకు ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు గడువు పొడిగించింది. డిసెంబర్ 30వ తేదీతో ముగియనున్న ఈ గడువును జనవరి 3వ తేదీ వరకు పెంచినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. జనవరి 3వ తేదీలోగా విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 10,59,233 మంది విద్యార్థులు వివిధ కాలేజీల్లో అడ్మిషన్లను పొందారు. వీరిలో 8,99,041 మంది విద్యార్థులు నిర్ణీత గడువులోపే పరీక్ష ఫీజులు చెల్లించారు. మరో 61,005 మంది విద్యార్థులు రూ.100 ఫైన్‌తో, 8,638 మంది విద్యార్థులు రూ.500ల ఫైన్‌తో, 5,212 మంది విద్యార్థులు రూ.1000 ఫైన్‌తో, 3,144 మంది విద్యార్థులు రూ.2వేలఫైన్తో చెల్లించారు. ఇప్పటి వరకు మొత్తంగా 9,77,040 మంది విద్యార్థులు మార్చి -2024 పరీక్ష ఫీజులను చెల్లించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది.
ఇంటర్ వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు కార్యదర్శి శృతి ఓజా గురువారం విడుదల చేశారు. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఫస్టియర్, ఫిబ్రవరి 29 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇక ఫస్టియర్ పరీక్షలు 2024 మార్చి 18, సెకండియర్ పరీక్షలు మార్చి 19న ముగియనున్నాయి. అయితే, ప్రధాన పరీక్షలు రెండు రోజుల ముందుగానే పూర్తవుతాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాస్త ముందుగానే ఇంటర్ వార్షిక పరీక్షలను నిర్వహించేలా ఇంటర్‌బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించి విడుదల చేసింది. ఒక రోజు ఫస్టియర్ వారికి, మరో రోజు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలుంటాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షలు రాసేందుకు విద్యార్థులను అనుమతించరు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల తేదీలు :
28-02-2024 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
01-03-2024 ఇంగ్లీష్ పేపర్-I
04-03-2024 మ్యాథమేటిక్స్ పేపర్-IA, బాటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I
06-03-2024 మ్యాథమేటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-I
11-03-2024 ఫిజిక్స్ పేపర్-I, ఎకనామిక్స్ పేపర్-I
13-03-2024 కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్-I
15-03-2024 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-I
18-03-2024 మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-I, జియోగ్రఫీ పేపర్-I
ఇంటర్ సెకండ్ పరీక్షల తేదీలు :
29-02-2024 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
02-03-2024 ఇంగ్లీష్ పేపర్-II
05-03-2024 మ్యాథమేటిక్స్ పేపర్-IIA, బాటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
07-03-2024 మ్యాథమేటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
12-03-2024 ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II
14-03-2024 కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్-II
16-03-2024 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-II
19-03-2024 మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-II, జియోగ్రఫీ పేపర్-II