నేడే సూర్యగ్రహణం.. హైదరాబాద్‌లో ఏ సమయం కనిపిస్తుందంటే..?
Partial Solar Eclipse | ఈ నెల 25న ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏండ్ల తర్వాత ఏర్పడబోతున్నది. ఇప్పుడు తప్పితే మళ్లీ పాక్షిక సూర్యగ్రహణం 2025 మార్చి 29న చోటు
హైదరాబాద్ : ఈ నెల 25న ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏండ్ల తర్వాత ఏర్పడబోతున్నది. ఇప్పుడు తప్పితే మళ్లీ పాక్షిక సూర్యగ్రహణం 2025 మార్చి 29న చోటు చేసుకోనుంది. కాకపోతే దీన్ని మన దేశంలో వీక్షించలేం. తిరిగి 2032 నవంబర్ 3న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుంది. కాబట్టి అక్టోబర్ 25న ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.
మరి ఇండియాలో ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే..?
కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ప్లానిటోరియం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో సూర్యాస్తమయానికి ఒక గంట ముందు కొన్ని నిమిషాల పాటు పాక్షిక సూర్య గ్రహణం కనిపించనున్నట్లు పేర్కొంది. పోరుబందర్, గాంధీ నగర్, ముంబై, శిల్వాసా, సూరత్, పనాజీ ప్రాంతాల్లో సూర్యగ్రహణం కనిపించనున్నట్లు తెలిపింది. గరిష్ఠంగా ఒక గంట 45 నిమిషాల పాటు పాక్షిక సూర్యగ్రహణం కనబడుతుంది. అందులో ఎక్కువ సమయం గుజరాత్‌లోని ద్వారకాలో కనువిందు చేయనుంది. ఢిల్లీలో అయితే సాయంత్రం 4:29 గంటల నుంచి 5:30 గంటల వరకు గ్రహణం కనిపించనుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అయితే సాయంత్రం 4:59 గంటలకు గ్రహణం కనిపించనుంది. కనీసం 49 నిమిషాల పాటు కనివిందు చేయనుంది.
అయితే ఈ సమయంలో 43 శాతం సూర్యుడిని అస్పష్టంగా చూడగలుగుతామని చెప్పింది. పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించాలనుకునే వారు తప్పనిసరిగా సోలార్ గాగూల్స్ ను ఉపయోగించాలి. ఇక ఐజ్వాల్, దిబ్రుగర్హ్, ఇంఫాల్ ఇటానగర్ కోహిమా, సిల్చార్, అండమాన్ నికోబార్ దీవుల్లో గ్రహణం అసలే కనబడదు.
పాక్షిక సూర్యగ్రహణం అంటే..?
సూర్యుడు, చంద్రుడు, భూమి సరిగ్గా ఒకే కక్ష్యలో లేనప్పుడు.. సూర్యుడి ఉపరితలంలో కొంత భాగం చీకటిగా మారినప్పుడు పాక్షిక సూర్య గ్రహణంగా పేర్కొంటారు. పాక్షిక సూర్య గ్రహణంలో ఆరంభం, గరిష్ఠం, ముగింపు అని మూడు భాగాలు ఉంటాయి. ఆరంభంలో చంద్రుడు సూర్యుడి డిస్క్ లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత సూర్యుడిలో అధిక భాగాన్ని కప్పేస్తాడు. ఆ తర్వాత క్రమంగా పక్కకు జరుగుతాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

