ఆన్ ఆఫ్‌ల మధ్య పీఆర్ఎల్ఐ మోటర్లు.. మూడున్నర గంటలపాటు నిలిచిపోయిన రెండో పంప్
బీఆర్ఎస్ నాయకుల ఆందోళనతో కృష్ణానది నీళ్లను ఎత్తిపోస్తున్న ప్రభుత్వం వాటి నిర్వహణను మాత్రం మరచిపోయింది. ఆదివారం పీఆర్ఎల్ఐ స్టేజీ -1లోని రెండో పంప్ మూడున్నర గంటలపాటు సాంకేతిక సమస్యతో నిలిచిపోయినట్టు తెలిసింది. బుధవారం మధ్యాహ్నం రెండు పంపులు ఆన్ చేయగా మూడుగంటలలోపు వాటిని బంద్ పెట్టారు.
కొల్లాపూర్, అక్టోబర్ 18 : బీఆర్ఎస్ నాయకుల ఆందోళనతో కృష్ణానది నీళ్లను ఎత్తిపోస్తున్న ప్రభుత్వం వాటి నిర్వహణను మాత్రం మరచిపోయింది. ఆదివారం పీఆర్ఎల్ఐ స్టేజీ -1లోని రెండో పంప్ మూడున్నర గంటలపాటు సాంకేతిక సమస్యతో నిలిచిపోయినట్టు తెలిసింది. బుధవారం మధ్యాహ్నం రెండు పంపులు ఆన్ చేయగా మూడుగంటలలోపు వాటిని బంద్ పెట్టారు. బీఆర్ఎస్, పీఆర్ఎల్ఐ ఆయకట్టు రైతాంగం, సోషల్ మీడియా నుంచి వచ్చిన ఒత్తిడితో మళ్లీ రాత్రి తొమ్మిది గంటలకు పంపులను ఆన్ చేశారు. మూడు రోజులు కూడా పంపులు నడువకముందే మళ్లీ రెండో పంపును సాంకేతిక సమస్య పేరుతో మూడున్నర గంటల పాటు బంద్ పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో ఒకే పంప్ నిరంతరాయంగా నడిచి రెండున్నర టీఎంసీలకు పైగా కృష్ణానది జలాలను నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు.
విద్యుత్తు శాఖ నుంచి తీసుకున్న గడువు ముగిసిపోతే మోటర్లు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంటుందని, వెంటనే పంపులను నిరంతరాయంగా నడిపిస్తూ నార్లాపూర్ రిజర్వాయర్‌తో పాటు, ఏదుల రిజర్వాయర్ వరకు కృష్ణానది జలాలను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేయాలని రైతాంగం కోరుతున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం స్టేజీ -1లో కేసీఆర్ హయాంలో ఆన్ చేసిన మొదటి పంప్ నిరంతరాయంగా నడుస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్ చేసిన రెండో పంప్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తున్నది. ఫ్రీక్వెన్సీ హెచ్చుతగ్గుదల వల్ల పంప్‌లు ఆన్ ఆఫ్ అయినట్టు తెలుస్తున్నది. ఆదివారం రెండో పంప్ మూడున్నర గంటలు నిలిపోవడానికి ఫ్రీక్వెన్సీ హెచ్చుతగ్గుదల వల్ల పంప్ ట్రిప్ అయి ఉండవచ్చని రిటైర్డ్ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. నీటి ఒత్తిడి పెరిగినప్పుడు మోటర్‌లోని లింకు రాడ్డు తెగిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకుండా మోటర్లను ఆన్ ఆఫ్ చేస్తూ వెళ్తున్నదని పలువురు విమర్శిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

