Medak | ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి : పద్మాదేవేందర్ రెడ్డి
రైతులు కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మండిపడ్డారు.
మెదక్ : రైతులు కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మండిపడ్డారు. మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మెదక్ జిల్లా రామాయంపేట మండలం రైలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద పద్మా దేవేందర్ రెడ్డి నాయకత్వంలో రాస్తారోకో చేయడంతో గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అకాల వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుజేసి పంటలు పండిస్తే ధాన్యం కొనకపోవడంతో అకాల వర్షానికి నీటి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రామాయంపేట సొసైటీ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్ గౌడ్, నిజాంపేట్ ఎంపీపీ సంపత్, సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాతారావు, మాజీ సర్పంచ్ నర్స గౌడ్, మాజీ ఎంపీటీసీ సత్యం, బిక్షపతి, నాయకులు ఉమామహేశ్వర్, అబ్దుల్ అజిజ్, హస్నోద్దీన్, రొయ్యల నవీన్, మధుకర్ రాంకీ శ్రావణ్, మహేష్, రంజిత్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

